సమాజంలో ప్రేమ పేరుతో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ప్రేమ పేరు చెప్పి మోసం చేసేవారిలో ఆడా, మగా అనే తేడా ఉండటం లేదు. అయితే మోసపోయిన వారు ఏడుస్తూ కూర్చోవడం లేదు. తగిన విధంగా బుద్ధి చెబుతున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆవివరాలు..
నువ్వే నా లోకం.. నువ్వు లేకపోతే నేను బతకలేను.. నువ్వు ప్రేమించకపోతే నాకు జీవితమే లేదు అంటారు.. తీరా ప్రేమించాకా.. కొన్నాళ్లకు.. ముఖం చాటేస్తారు.. మరో వ్యక్తితో కొత్త రిలేషన్ ప్రారంభిస్తారు. ఈమధ్యకాలంలో ఆడామగా తేడా లేకుండా ప్రేమ పేరు చెప్పి.. పిచ్చి వేషాలు వేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మోసపోయిన వాళ్లు.. ఊరికే ఉండటం లేదు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మోసం చేసిన వారి మీద ఫిర్యాదు చేయడం చేస్తున్నారు. ఇక కొందరు మోసం చేసిన వారి ఇంటి బయట కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మోసపోయామనే భావనను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పలువురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడిపాడు. వారందరిని కాదని.. చివరకు మరో యువతిని వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలో అతడి చేతిలో మోసపోయిన వారు.. నిన్ను వదిలిపెట్టం అంటూ పెళ్లి మండపం ముందు నిరసనకు దిగారు. ఆ వివరాలు..
ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. నైరుతి చైనాలోని యున్నన్ ప్రావిన్సులకు చెందిన చెన్ అనే యువకుడికి ఫిబ్రవరి 6న వివాహం జరిగింది. ఈ సమయంలో పెళ్లిమండపం వద్ద కొందరు యువతులు, చేతిలో ‘‘నిన్ను వదలం.. నీ జీవితం నాశనం చేస్తాం’ అనే బ్యానర్ పట్టుకుని నిల్చుని ఉన్నారు. వాళ్లని చూసి చెన్ ఒక్కసారి షాకయ్యాడు. ఎందుకంటే వాళ్లంతా అతడి మాజీ ప్రియురాళ్లు. గతంలో వారితో రిలేషన్‌లో ఉన్నాడు. కానీ వారికి బ్రేకప్ చెప్పాడు. ఇప్పుడు వారంతా ఇలా తన పెళ్లి మండపం వద్దకు వచ్చి నిరసన తెలపడం చూసి చెన్ విస్తుపోయాడు. ‘మేం నీ మాజీ ప్రియురాళ్లం. ఈ రోజు మేమంతా కలిసి నీ జీవితాన్ని నాశనం చేస్తాం’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని రోడ్డుకు మధ్యలో వాళ్లు నిలబడ్డారు. వివాహానికి వచ్చిన అతిథులు.. యువతలను చూసి అసులు వీరంతా ఎవరు.. ఎందుకిలా నిల్చున్నారు అని మాట్లాడుకోసాగారు.
పెళ్లి మండపం ముందు నిరసన చేస్తున్న యువతులను చూసిన వధువు, ఆమె కుటుంబసభ్యులు.. దీని గురించి చెన్‌ని నిలదీశారు. ఆ యువతులంతా ఎవరు.. వారికి నీకు సంబంధం ఏంటి.. ఎందుకు నీ జీవితం నాశనం చేస్తామంటున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక చెన్ స్పందిస్తూ.. అసలు విషయం చెప్పుకొచ్చాడు. తాను గతంలో ప్రేమ పేరుతో వారితో కలిసి తిరిగానని అంగీకరించాడు. పైగా ప్రస్తుతం వాళ్లు చేసిన పనికి తనకు ఏమాత్రం కోపం రావడం లేదని చెప్పుకొచ్చాడు. వారితో రిలేషన్‌లో ఉన్నప్పుడు తాను ఓ చెడు బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్నది నిజమేనని ఒప్పుకున్నాడు. అప్పట్లో కుర్రతనం… విచక్షణ లేని కారణంగా చాలా మంది అమ్మాయిలను బాధ పెట్టానని.. వారే వీరు అని వెల్లడించాడు. అయితే ప్రస్తుతం తాను మారిపోయానని.. రిలేషన్ వాల్యూ తనకు తెలుసని చెప్పుకొచ్చాడు.
అంతేకాక ఈ సందర్భంగా చెన్ ‘‘అమ్మాయిలను మోసం చేయొద్దు.. వారితో నిజాయతీగా ఉండాలి.. ఒకవేళ భవిష్యత్తులో ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే.. మీరు బలవుతారు’’ అపి సూచించాడు. అయితే, పెళ్లి సమయంలో తన మాజీ ప్రియురాళ్లు చేసిన పని తనని కాస్త ఇబ్బంది పెట్టిందని.. కాబోయే భార్య కూడా దీని గురించి.. తనతో గొడవపడిందని చెన్ వాపోయాడు. అయితే వారితో బ్రేకప్‌కి దారితీసిన కారణాలను మాత్రం చెన్ బయటపెట్టలేదు. తాను చేసిన పనికి క్షమాపణలు కోరాడు.
ఈ సంఘటనపై నెటిజనులు రకరకాలు స్పందిస్తున్నారు. అతడు చేసింది తప్పు.. దాన్ని క్షమించడం నేరం.. అంతమంది మహిళలను మోసం చేశాడు అంటే.. భవిష్యత్తులో ఇంక ఎంత మందిని మోసం చేస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.