అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ (సీపీఎస్) బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తరగతి నుంచి ఆపై అన్ని తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్‌లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టబోతోంది. ఈ నిబంధన బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించేటట్లు అన్ని విద్యాసంస్థలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 2020 డిసెంబర్లోనే సీపీఎస్ బోర్డు ఈ విధానాన్ని రూపొందించింది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నది బోర్డు అభిప్రాయం. ఎలిమెంటరీ స్కూళ్లలో 250, హైస్కూళ్లలో 1000 వరకు కండోమ్‌లు అందుబాటులో ఉంటాయి. షికాగో ఆరోగ్యశాఖ సహకారంతో కండోమ్‌లను సరఫరా చేస్తారు. విద్యార్థులకు శరీర నిర్మాణ శాస్త్రం, యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం వంటి అంశాలను బోధిస్తారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసే తల్లిదండ్రులు బోర్డుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది సీపీఎస్.
‘ఆరోగ్యపరంగా సరైన నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికైనా ఉంది. నిర్ణయాలకు తగ్గట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు వారికి సరిపడా వనరులు కావాలి. కండోమ్‌లు కావాలనుకున్నప్పుడు అవి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అనుకుంటున్నాం. ఇవి అందుబాటులో లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. లైంగిక సంక్రమణ వ్యాధులు, అవాంఛిత గర్భాలు వస్తాయి. అలా కాకుండా చూసుకోవడం కోసమే ఈ చర్యలు. దీనిపై కొంత వ్యతిరేకత వచ్చే అవకాశముంది. అయినప్పటికీ సమాజం మారిందని విశ్వసిస్తున్నాని సీపీఎస్ వైద్యుడు కన్నెత్ ఫాక్స్ పేర్కొన్నారు.
ఆ డాక్టర్ భావించినట్లే కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే 12ఏళ్ల వయసుగల వారని, వారు ఇంకా చిన్నపిల్లలేనని పేర్కొంటున్నారు. అసలు పిల్లలకు కండోమ్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చిందని మండిపడుతున్నారు. తమ విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సహజంగానే మరికొంతమంది అదే సమయంలో మరికొందరు సీపీఎస్ బోర్డు నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
Nearly every CPS school will have items that experts say will keep students healthy and safe — menstruation products and condoms. https://t.co/DNXYsD2MM0
— Chicago Sun-Times (@Suntimes) July 8, 2021