మీరు బస్సులో కానీ, రైలులో కానీ ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీ పక్కనే ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతడ్ని చూస్తే అమాయకంగా.. అప్పుడే గుడినుంచి వచ్చిన వాడిలా ఉన్నాడు. ఇలాంటి సమయంలో అతడు హంతకుడని తెలిస్తే.. అతడు పదుల సంఖ్యలో హత్యలు చేశాడని తెలిస్తే.. అదంతా కాదు.. హత్యలు చేసిన వ్యక్తి పక్కనే మీరు కూర్చోవాల్సి వస్తే!.. పరిస్థితి దారుణంగా ఉంటుంది కదూ.. అచ్చం ఇలాంటి పరిస్థితే ఏ మహిళకు ఎదురైంది. ఆమె ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓ నర హంతకుడి పక్కనే కూర్చోవాల్సి వచ్చింది.
ఆ నర హంతకుడు ఎవరో కాదు ఛార్లెస్ శోభరాజ్. ఇంతకీ ఏం జరిగిందంటే.. 1970లలో 30 మంది మహిళల్ని హత్య చేసిన కేసులో శోభరాజ్ జైలు పాలయ్యాడు. గత కొన్ని రోజుల వరకు నేపాల్‌లోని జైలులో ఉన్నాడు. తాజాగా, అతడు జైలు నుంచి విడుదల అయ్యాడు. తన సొంత దేశం అయిన ఫ్రాన్స్‌కు ప్రయాణం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడు విమానం ఎక్కాడు. ఆ విమానంలో అతడి పక్కనే ఓ మహిళ కూర్చుని ఉంది. మొదటి అతడు ఎవరో గుర్తించని ఆమె బాగానే కూర్చుంది. అయితే, కొద్దిసేపటి తర్వాత అతడు ఎవరో తెలిసి భయపడసాగింది.
ఆ మహిళతో పాటు ఆమె పక్కనే ఉన్న మరో మహిళ కూడా భయపడసాగింది. శోభరాజ్ పక్కన ఉన్న మహిళ అతడికి కొద్దిగా దూరం జరిగి, పక్కన ఉన్న మహిళను ఆనుకుంది. దీన్ని విమానంలో ఉన్న ఓ వ్యక్తి ఫోటో తీశాడు. తనను ఫొటో తీస్తున్నారని తెలిసి ఛార్లెస్ ఫోన్ వైపు తిరిగాడు. అతడి పక్కన ఉన్న మహిళలు మాత్రం భయంతో దూరంగా జరిగి ఉండిపోయారు. ఈ ఫొటోను ప్రముఖ జర్నలిస్ట్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
That awkward moment when you realise you’re sitting next to a serial killer who claimed at least 30 lives pic.twitter.com/QmgQFdZRsK
— Jairaj Singh (@JairajSinghR) December 25, 2022