క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 11 లక్షలకు పైగా చెల్లించిందా? ఆ డబ్బుతో కొత్త కారు కొనుక్కోవచ్చు కదా మేడమ్ అని మీరు అనచ్చు. కానీ ఆ కొత్త కారుకైనా లైసెన్స్ కావాలి కదా. అయితే మాత్రం లైసెన్స్ కి ఎవరైనా అన్ని లక్షలు ఖర్చు పెడతారా? అంటే ఈ మహిళ అందుకు నిదర్శనం. లంచాలు ఉంటాయని తెలుసు గానీ మరీ ఈ స్థాయిలో ఉంటాయా? అని అనుకోడానికి కూడా లేదు. లంచాలు అస్సలు ఇవ్వలేదు. చివరకు లైసెన్స్ సాధించింది. 69 ఏళ్ల వయసులో ఆమె క్యాబ్ నడిపేందుకు లైసెన్స్ పొందింది. ఆమె కథ ఏంటో చదివేయండి.
టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే వెంటనే వచ్చేస్తుంది. కానీ 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే కోసం మాత్రం కొంతమందికి రెండు, మూడు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్ని సార్లు అప్లై చేస్తే అన్ని సార్లు డబ్బు కట్టాల్సి ఉంటుంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఈ మహిళ ఏకంగా 11 లక్షల 15 వేల 273 రూపాయలు చెల్లించింది. 960వ ప్రయత్నంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఐదేళ్ల పాటు ఆఫీస్ చుట్టూ తిరిగింది. 960 సార్లు ఆమె లైసెన్స్ కోసం పర్యటనలు చేసింది. తొలుత 2005 ఏప్రిల్ లో రాత పరీక్ష రాసింది. అందులో ఫెయిల్ అవ్వడంతో ప్రతీ రోజూ వారంలో 5 రోజులు మళ్ళీ పరీక్ష రాసేందుకు వెళ్ళింది. అలా మూడేళ్ళ పాటు ఆఫీసు చుట్టూ తిరిగింది. ఆ తర్వాత వారానికి రెండు సార్లు లైసెన్స్ కోసం తిరగడం ప్రారంభించింది.
ఆమె పేరు చా సా సూన్. దక్షిణ కొరియాకి చెందిన ఈమె 860 రాత పరీక్షలు రాసిన తర్వాత పాస్ అయ్యింది. రాత పరీక్ష అయిపోయింది, ఇక డ్రైవింగ్ టెస్టు ఉంది. అది ఇంకా కష్టంగా ఉంటుంది. కానీ ఆమె 10 ప్రయత్నాల్లో కారు డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. అలా ఆమె 960 సార్లు ప్రయత్నించి 2010లో అంటే 69 ఏళ్ల వయసులో ఆమె లైసెన్ద్ పొందింది. దీని కోసం ఆమె 11 వేల పౌండ్లు ఖర్చు పెట్టింది. మన భారత కరెన్సీ ప్రకారం 11 లక్షలు పై మాటే. ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ రాగానే డ్రైవింగ్ స్కూల్ బోధకుడు పార్క్ సు-యెన్, డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది అందరూ ఆమెను హగ్ చేసుకుని, బొకేలు ఇచ్చి అభినందనలు తెలియజేశామని అన్నారు. ప్రయత్నాలు మానేయమని చెప్పే ధైర్యం తమకు లేక చెప్పలేదని అన్నారు. ఈ సంఘటన జరిగి 13 ఏళ్ళు అవుతుంది. 2010లో ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే 960 సార్లు ప్రయత్నించి ఎట్టకేలకు డ్రైవింగ్ లైసెన్స్ గెలుచుకున్న చా సా సూన్ కథ ఆమెను సెలబ్రిటీని చేసింది. దక్షిణ కొరియా కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ ఆమెకు ఒక కారుని బహుమతిగా ఇచ్చింది. ఇది జరిగి చాలా ఏళ్ళు అవుతున్నా మళ్ళీ ఈమె కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఒకటి, రెండు సార్లు ప్రయత్నించగానే విసుగు వచ్చేస్తుంది. వేరే ఎవరైనా అయితే ఈ డ్రైవింగూ వద్దూ, ఈ కారూ వద్దూ అని చెప్పి వేరే వృత్తి చూసుకుంటారు. కానీ ఈమె మాత్రం అలుపెరగకుండా పట్టుదలతో 960 సార్లు ప్రయత్నించి సాధించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఆరు పదుల వయసులో. ఆమె సహనానికి సెల్యూట్ చేయాల్సిందే. ఏమీ సాధించలేకపోతున్నాం అని బాధపడే యువతకు ఆమె కథ ఒక పాఠం అని చెప్పవచ్చు. మరి ఈ మహిళపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
🪪 ¡LUEGO DE 959 INTENTOS! Sacó su licencia al pasar su examen 960
Cha Sa Soon, de Corea del Sur, obtuvo su licencia de manejo tras casi mil intentos de pasar el examen. Una empresa automotriz le obsequió un vehículo a cambio de publicidad.https://t.co/qPgKC5yRSe
— ImpactoVenezuela (@ImpactoVE) March 29, 2023