రెండేళ్ల క్రితం భారత్‌లో పెగాసస్ సంస్థ తయారు చేసిన స్పైవేర్ ఇప్పుడు భారత్‌ను భయపెడుతున్నది. ఈ స్పైవేర్‌ను నిఘా కోసం వినియోగిస్తుంటారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఈ స్పైవేర్‌ను వినియోగిస్తుంటాయి. మిస్‌డ్ కాల్ ద్వారా మొబైల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత మిస్‌డ్ కాల్‌ను స్పైవేర్ డిలీట్ చేస్తుంది. అక్కడినుంచి కాల్ డేటాను, వాట్పప్ డేటాను, ఎన్‌క్రిప్టెడ్ సందేశాలను స్పైవేర్ రీడ్ చేస్తుంది. ఒకవేళ తప్పుడు డివైజ్‌లోకి ప్రవేశించినట్టు తెలిస్తే 60 రోజుల తరువాత ఆ స్పైవేర్ దానంతట అదే నాశనం అవుతుంది. ఈ స్పైవేర్ సహాయంతో హ్యకింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఐఫోన్ తమ యూజర్లకోసం ఐఓఎస్ అప్డేట్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది.
ఈ స్పైవేర్ తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా హ్యాక్‌చేసే సామర్ధ్యం ఉందని తెలియడంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. 2019లో తొలిసారి ఇండియాలో ఈ స్పైవేర్ కలకలం సృష్టించింది. వాట్సప్ ద్వారా అజ్ఞాత సందేశాలు వస్తున్నాయని గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘పెగాసస్’ హ్యాకింగ్ అంశం బాధితుల జాబితాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్లు ఉన్నట్టు బయటకు వచ్చింది.
మంత్రి ప్రహ్లాద్ పటేల్ సన్నిహితులకు చెందిన 18నంబర్లు కూడా హ్యాక్ అయ్యాయని ‘ద వైర్’ వార్తా సంస్థ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ అసమ్మతివాదులతో సహా 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్‌లను పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి హ్యాక్ చేసినట్లు భారతదేశంలో ఇజ్రాయెల్ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ ఆరోపణలు ఎదుర్కొంటుంది.
టిబెటన్ మత గురువు దలైలామా సలహాదారులు, నాగలీమ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ కొంతమంది నాయకుల పేర్లు కూడా పెగసాస్ స్పైవేర్ బాధితుల జాబితాలో చేర్చారు. వైరాలిజిస్టు గగన్‌దీప్ కాంగ్ ఈ జాబితాలో ఉన్నారు. 2018లో ఆమె ఫోన్లు హ్యాక్ అయ్యాయి. నిఫా వైరస్‌కు వ్యతిరేకంగా ఈ వైరాలిజిస్టు పాటుపడుతున్న దశలో ఈ పరిణామం జరిగింది. ఇక స్పైవేర్ లక్షంలో ఇండియాకు చెందిన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అధినేత హరి మీనన్, ప్రముఖ ఉద్యోగి ఒకరు ఉన్నట్లు గుర్తించారు.
పెగసాస్ ప్రాజెక్ట్ గ్రూప్ మీడియా పార్ట్నర్స్ విశ్లేషించిన నవంబర్ జాబితాలో అనిల్ అంబానీ, రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ అఫిషియల్స్ ఉపయోగించిన ఫోన్ నంబర్లను కూడా చేర్చారని ఒక నివేదిక పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఆ ఫోన్ నంబర్లను అనిల్ అంబానీ ఉపయోగిస్తున్నారా లేదా అని నివేదికలో నిర్ధారించలేదు.