నేటికాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ఏదైనా వార్త సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తే.. క్షణాల్లో అందరికి చేరుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పొరపాటున చేసే పోస్టులు ఇబ్బందులకు గురిచేస్తాయి. వాటిపై ఓ రేంజ్ లో ట్రోల్స్ కూడా వస్తుంటాయి. అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ప్రముఖుల సైతం అలానే పోరపాటు చేసి.. ట్రోల్స్ కు గురవుతుంటారు. తాజాగా కెనడా ఆరోగ్యశాఖ చేసిన పోరపాటు పెద్ద దుమారానే లేపింది. కెనడాలోని కొవిడ్ పోర్టల్‌లో పోస్టు చేయాల్సిన లింక్ కు బదులుగా పో*ర్న్ హబ్ కు చెందిన లింక్ ఒకటి పోస్టు చేసింది ఆరోగ్య శాఖ. క్షణాల్లో పొరపాటును సరిదిద్దుకుంది. కానీ అప్పటికే నెటిజన్స్ నుంచి ట్రోల్స్ ఓరేంజ్ వచ్చాయి.
కెనడా ఆరోగ్యశాఖ ప్రజల ఆరోగ్యంకు సంబంధించి కొవిడ్ పోర్టల్ తయారు చేసింది. దానికి సంబంధించిన లింక్ ను ఆరోగ్యశాఖలో పోస్ట్ చేయాల్సి ఉంది. అయితే కొవిడ్ పోర్టల్ లింక్ కు బదులుగా పో*ర్న్ హబ్ కు చెందిన లింక్ ఒకటి పోస్టు చేసింది. అయితే క్షణాల్లో తేరుకుని పోస్టును డిలీట్ చేసింది. కానీ అప్పటికే నెటిజన్లు గమనించడంతో ట్రోలింగ్ తప్పలేదు.”పరిస్థితి పరిధి దాటడంతో అలా జరిగింది. తప్పుడు లింక్ ట్విట్టర్ లో పోస్ట్ చేసేశాం” అంటూ AFకి ఈమెయిల్ లో ఆరోగ్య శాఖ విన్నవించుకుంది. లక్ష మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న హెల్త్ మినిష్ట్రీపై ఇన్వెస్టిగేషన్ జరపనున్నారు అధికారులు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.