9 నెలల గర్భంతో ఉన్న నిండు చూలాలు ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో అందరికీ విదితమే. పనులు చేయడం పక్కనపెడితే.. కాలు తీసి కాలు పక్కన పెట్టాలన్నా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. అలాంటిది అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం పరుగు పోటీలో పాల్గొని సత్తాచాటింది. ఆగకుండా మైలు దూరం పరుగెత్తి సరి కొత్త రికార్డును సృష్టించింది. ఆమె ఈ నిర్ణయం తీసుకుంది..? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భంతో ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అందరికీ విదితమే. మూడో నెల వరకు కాస్త అటు ఇటు తిరిగినా నెలలు పైబడే కొద్దీ కాలు తీసి పెట్టాలంటే భయపడిపోతుంటారు. ఇక 9వ నెల వచ్చిందంటే గర్భిణి వెన్నంట ఒక మనిషి ఉండాల్సిందే. కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అడుగులు వేస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం పరుగు పోటీలో పాల్గొని సత్తా చాటింది. కేవలం 5 నిమిషాల 17 సెకన్ల సమయంలోనే మైలు దూరాన్ని పూర్తి చేసి ఔరా అనిపించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో ఆమె పేరు మార్మోగుతోంది.
పేరు.. మెకెన్న మైలర్. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్. ఆమె లక్ష్యమే పరుగులు తీయడం. మిడిల్ డిస్టెన్స్ రన్నర్‌గా కెరీర్ ఆరంభించిన మైలర్ మూడేళ్ళ క్రితం 2020లో ఆమె తన తొలి ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఇలానే పోటీలో పాల్గొంది. అప్పుడు మైలు దూరాన్ని 5 నిమిషాల 25 సెకన్లలో పూర్తి చేసింది. అప్పట్లో ఇదో రికార్డు. కానీ అది ఆమెకు సంతృప్తినివ్వలేదు. దానిని మెరుగుపరుచుకోవాలనుకుంది. అందుకు మూడేళ్ళ సమయం పట్టింది. గతేడాది మరోమారు గర్భం దాల్చిన ఆమె.. ఆనాటి నుండి ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఇంకేముంది.. 9వ నెల రాగానే కాలిఫోర్నియాలో జరిగిన ఓ ట్రాక్ మీట్‍లో పరుగు ప్రారంభించింది. ఈసారి 5 నిమిషాల 17 సెకన్లలోనే మైలు దూరాన్ని పరుగెత్తి గత రికార్డును చెరిపేసింది. మైలు దూరం పరుగెత్తడం సర్వసాధారణం అయినా.. తొమ్మిది నెలల గర్భిణి ఆగకుండా మైలు దూరం పరుగెత్తడమన్నది గొప్ప విషయమే. ఆమెను ‘వండర్ విమెన్‘ అంటూ నెటిజన్స్ కొనియాడుతున్నారు.
ఈ విషయంపై మైలర్ మాట్లాడుతూ.. “ప్రెగ్నెన్సీ సమయంలో ప్రాక్టీస్ చేయడం సాధారణమేనని నేను అనుకున్నా. కానీ నా నిర్ణయాన్ని చాలా మంది వ్యతికరేకించారు. తొమ్మిది నెలల గర్భంతో ఉన్నప్పుడు తాము కనీసం సోఫా నుంచి దిగలేకపోయామని, మీరు ఎలా పరిగెత్తారని చాలా మంది నన్ను ప్రశ్నించారు. అంతేకాదు..9వ నెల అంటే బిడ్డ ఎదిగి ఉంటుంది కనుక ఇంతటి కష్టమైన రేస్ చేయకుండా ఉండాల్సిందని కొందరు సూచించారు..” అని మైలర్ వెల్లడించారు. వ్యక్తిగత రికార్డుల కోసం ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Makenna Myler compitió embarazada de 9 meses en una carrera.
📈 Las mujeres no paran de romper límites en los deportes.
🗣🗣🗣 “𝐍𝐨 𝐭𝐞𝐧𝐠𝐚𝐬 𝐦𝐢𝐞𝐝𝐨 𝐝𝐞 𝐝𝐞𝐬𝐚𝐟𝐢𝐚𝐫 𝐚 𝐥𝐚 𝐫𝐞𝐚𝐥𝐢𝐝𝐚𝐝”.
♥️ Una historia que hay que contar. pic.twitter.com/CFKWpGpQnM
— Manu Fresno (@Maanuf96) March 11, 2023