Ghost: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా దెయ్యాల్ని, మానవాతీత శక్తుల్ని నమ్మేవారు ఇంకా ఉన్నారు. దెయ్యాల్ని నమ్మేవారు భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాల్లోనే మూడ నమ్మకాలు ఎక్కువ. ఓ వ్యక్తి తన ఫోన్‌ను దెయ్యం వాడుతోందని, దాన్నుంచి ప్రియురాలికి మెసేజ్‌లు పంపుతోందని ఆరోపిస్తున్నాడు. ఈ వింత విచిత్రమైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, కాలిఫోర్నియాలోని స్టాక్‌టాన్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రియురాలితో కలిసి న్యూయార్క్‌లోని ఓ పబ్‌కు వెళ్లాడు. అక్కడ టాయిలెట్స్ దగ్గర ఏదో భయానక దృశ్యం కనిపించటంతో దాన్ని ఫొటో తీశాడు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చి నిద్రపోయారు.
ఉదయం రెండు గంటల ప్రాంతంలో ఇద్దరు బెడ్‌పై నిద్రపోతున్నారు. ఈ టైంలో తన ఫోన్‌నుంచి ప్రియురాలికి ఓ మెసేజ్ వచ్చింది. ‘‘నేను తర్వాత ఫోన్ చేయోచ్చా?’’ అని ఉంది. కొన్ని గంటల తర్వాత ‘we are inv 4n 2 z 4nb’ అన్న మెసేజ్ ప్రియురాలికి వెళ్లింది. దానికి అర్థం ఏంటో తెలుసుకోవటానికి ఇంటర్‌నెట్‌లో వెతకాల్సి వచ్చింది. అతడు మాట్లాడుతూ.. ‘‘ మేము వెళ్లిన పబ్ దెయ్యాలకు సంబంధించినదై ఉండాలి. నేను నా జీవితంలో అలాంటి మెసేజ్‌ను వాడలేదు. ఇదేదో మానవాతీత శక్తులకు సంబంధించినది అయి ఉంటుంది. లేదా ఎవరైనా నా ఫోన్‌ను హ్యాక్ చేసి నా ఫోన్ నెంబర్‌నుంచి మెసేజ్‌లు పంపుతూ ఉండాలి’’ అన్నాడు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : స్టూడెంట్స్ మీదకు పోలీసుల్ని తీసుకొచ్చిన ప్రొఫెసర్.. కారణం ఏంటంటే?..