క్యాడ్‌బరీ చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అందువల్ల యూకేలోని సూపర్ మార్కెట్ల నుంచి ఈ ఉత్పత్తులను నిషేదిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే కొని ఉంటే ఆ ఉత్పత్తులను ఎక్కడ కొన్నారో అక్కడ తిరిగి ఇచ్చేయమంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.
పిల్లలు, పెద్దలు అందరూ అత్యంత ఇష్టంగా తినే క్యాడ్‌బరీ చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రధానంగా బ్రిటన్‌లో ప్రభలుతోన్న లిస్టెరియా ఇన్ఫెక్షన్ వ్యాపికి క్యాడ్‌బరీ చాక్లెట్లే కారణమన్న వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో యూకేలోని సూపర్ మార్కెట్ల నుంచి ఈ ఉత్పత్తులను నిషేదిస్తున్నారు. ప్రజలు క్యాడ్‌బరీ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే కొని ఉంటే ఆ ఉత్పత్తులను ఎక్కడ కొన్నారో అక్కడ తిరిగి ఇచ్చేయమంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.
యూకేలో వేలాది క్యాడ్‌బరీ ఉత్పత్తులను వెనక్కి ఇచ్చేయాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రధానంగా ఓ బ్యాచ్‌కు చెందిన ప్రాడక్టులు అన్నీ తిరిగి ఇచ్చేయాలని, దానిపై లిస్టీరియా బ్యాక్టీరియా ఫామ్ అయిన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ క్యాడ్‌బరీ ఉత్పత్తుల ఎక్స్‌పైరీ డేట్‌లను చెక్ చేయాలని వినియోగదారులకు యూకే ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ పేర్కొంది. ఎక్స్ పైరీ డేట్ మే 17, మే 18 ఉన్న ఉత్పత్తులను తిరిగిచ్చేయాలని తెలిపింది. వాటిని తినవద్దని, వెనక్కి ఇచ్చి రిఫండ్ పొందాలని ప్రజలకు సూచించినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఇదిలావుంటే యూకే సూపర్ మార్కెట్ చైన్ ముల్లర్ అనే సంస్థ.. ఈ క్యాడ్‌బరీ ఉత్పత్తులను వెనక్కి తెచ్చి డబ్బులు తీసుకోవాలని తెలిపింది.
లిస్టెరియా అనేది మానవులతో సహా క్షీరదాలలో కనిపించే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వలన కలిగే ఇన్ఫెక్షన్‌ను లిస్టెరియోసిస్ అంటారు. ఈ బ్యాక్టీరియా ఉన్న ఆహారం తిన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన జంతువుల మాంసాన్ని తిన్నవారి శరీరంలో ఈ బ్యాక్టీరియా చేరుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వ్యాధి సోకిన జంతువులో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ బ్యాక్టీరియా శరీరంలోని ఎముకలు, కీళ్ళు, ఛాతీ, పొత్తికడుపుపై నేరుగా ప్రభావం పడుతుంది. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా గర్భిణీ స్త్రీలు, వృద్ధులపై అధిక ప్రభావం చూపుతుందట.
Urgent product recall: Cadbury customers told to return products over ‘deadly’ bacteria fears https://t.co/gNLOAcUyAT
— GB News (@GBNEWS) May 2, 2023