సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ, ఏం జరిగినా కూడా క్షణాల్లో తెలిసిపోతుంది. అలానే సోషల్ మీడియా ద్వారా అనేక వీడియోలు మన కళ్ల ముందు ప్రత్యక్షమౌతుంటాయి. ఇలా నెట్టింట్లో కనిపించే వీడియోల్లో కొన్ని.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన వీడియోలను చూశాము. తాజాగా ఆ కోవకు చెందిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రాన్ని తలపిస్తున్న ఓ వరద నీటిలో బస్సు.. సూపర్ ఫాస్ట్ రైలులాగా దూసుకెళ్లింది. పక్కనే ఉన్న వాహనాలు వరద నీటిలో చిక్కుంటే.. ఈ బస్ మాత్రం బిందాస్ గా అదే నీటిలో దూసుకెళ్లింది. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటుచేసుకుంది. ఈ వీడియో చేసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. వీటి కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించి.. చెట్లు , ఇళ్లు కూలిపోయాయి. అలానే వరదనీటితో రహదారులన్నీ దిగ్భంధమయ్యాయి. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అక్కడి యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది. వరదముంపుకు గురైన ప్రాంతాలను సర్వే చేయడం, ఎంతమేరకు నష్టం వాటిల్లింది అనే దానిపై సమీక్షించడం వంటి పనులు ప్రారంభించింది. న్యూజిలాండ్ చరిత్రలోనే ఈ వరదను అతిపెద్ద విపత్తుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ వరద నీటికి రోడ్లపై ఉండే వాహనాలు కొట్టుకుపోయాయి. మరికొన్ని వాహనాలు పడవల మాదిరిగా నీటిపై తేలియాడాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వరదలకు సంబంధించిన ఓ వీడియో అందరిని తెగ ఆకర్షించింది. ఆ వీడియోలో సముద్రాన్ని తలపిస్తున్న రహదారి ఒకటి ఉంది. అలానే ఆ వరదల్లో కొన్ని కార్లకు కేవలం వాటిపై ఉండే రూఫ్ మాత్రమే కనిపిస్తోంది. అంత నిండుగా ఉన్న వరద నీటిలో ఒక పెద్ద బస్సు చాలా సునాయాసంగా వెళ్లిపోతుంది.ఈ వరద నీరే కాదు.. ఇంతకు మించి వచ్చిన.. దూసుకెళ్తా.. అన్నట్లుగా ఆ బస్సు వరద నీటిలో వెళ్లింది. అందులో ప్రయాణికులు కూడా ఉన్నారు.
వారు కూడా తాము వరద నీటి మధ్యలో వెళ్తున్నట్లు అనుకోలేదు. అలానే డ్రైవర్ కూడా ఏదో ఖాళీ రోడ్డు మీద నడుపుతున్నంత సులభంగా వరద నీటిలో నడిపేశాడు. బస్సుకు సగం మేర నీరు రావడంతో అది వెళ్తుంటే.. ఎదో బోటు వెళ్తున్నట్లు అనిపించింది. ఈ వీడియోను డెబ్బీ బర్రోస్ అనే మహిళ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలు కామెంట్స్ చేశారు. ఆ డ్రైవర్ కు డ్రైవింగ్ లో మంచి నైపుణ్యం ఉన్నట్లుంది కాబోలు అంటూ ప్రశంసించారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Historic flooding? No problem, at least for this New Zealand bus driver, who was seen in a viral video driving his bus through shoulder-deep floodwaters like it was NBD.
The area around Auckland has experienced unprecedented flooding and rainfall in recent days. pic.twitter.com/a4OUrb5eUj
— NowThis (@nowthisnews) February 3, 2023