ఈ మద్య సెలబ్రెటీలు, రాజకీయ నేతలపై పలుమార్లు దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మద్యనే అమెరికాలో అధ్యక్ష భవనం శ్వేత సౌధం ఓ యువకుడు నానా బీభత్సం చేశాడు.
ఈ మద్య అమెరికాలోని వైట్ హౌస్ పరిసర ప్రాంతంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. తెలుగు సంతతికి చెందిన ఓ యువకుడు దేశ అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలో సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసి బారీకేడ్లను ఢీ కొట్టి నానా యాగీ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అప్రమత్తమై ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరువ కముందే బ్రిటన్ ప్రధాన మంత్రి అధికార నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడియి యత్నంచడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
అమెరికాలో అధ్యక్ష భవనం శ్వేత సౌధం వద్ద బారీకేడ్లను ఢీ కొట్టి తెలుగు సంతతికి చెందిన ఓ యువకుడు నానా బీభత్సం చేశాడు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన తీవ్ర కలకం రేపుతుంది. బ్రిటన్ ప్రధాన మంత్రి అధికార నివాసం వద్ద ఓ అజ్ఞాత వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. దీంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఒక్కసారే అలర్ట్ అయి వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తుంది.
లండన్ లోని ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ గేటుని అజ్ఞాత వ్యక్తి తన కారుతో అత్యంత వేగంగా దూసుకు వచ్చి దాడి చేశాడు. అప్రమత్తమైన అధికారులు ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నడి వయసు ఉన్న ఆ వ్యక్తిని సంకెళ్లతో బంధించి తీసుకు వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాధారణంగా బ్రిటన్ ప్రధాని అధికార నివాసం వద్ద ఎప్పుడై హై సెక్యూరిటీ ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. 1991 లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్ లో బాంబు దాడులకు పాల్పడిన తర్వాత ఇక్కడ భద్రత ఏర్పాటు ఎంతో పటిష్టం చేశారు. క్రిమినల్ డ్యామేజ్, డేంజరస్ డ్రైవింగ్ ఆరోపణలపై ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.