ఈ విశాల ప్రపంచంలో దాగున్న ప్రతి దాని గురించి మనిషి పూర్తిగా తెలియాలంటే.. ఒక్క జీవితం సరిపోదు. వేల ఏళ్ల నుంచి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.. మనకు తెలియని వింతలు బయటపడుతూనే ఉన్నాయి. జీవుల విషయంలో కూడా ఇదే జరుగుతుంటుంది. ఇప్పటి వరకు మన శాస్త్రవేత్తలు కొన్ని లక్షల జీవులను గుర్తించారు. వెలుగులోకి రాని జీవులు ఇంకా ఎన్ని ఉంటాయో తెలియదు. వీటిల్లో కొన్ని అప్పుడప్పుడు మనిషికి తారసపడి.. భయభ్రాంతులకు గురి చేస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బ్రెజిల్ లో చోటు చేసుకుంది. సముద్రంలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడిని ఓ వింత జీవి వెంబడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
Criatura misteriosa perseguiu um barco ontem no Rio Grande do Sul.
Segue o fio para descobrir que monstro é esse nessa #BioThreadBr pic.twitter.com/chOfZ5d0VK— Pedrohenriquetunes (@PedroHTunes) January 27, 2022
దక్షిణ బ్రెజిల్ లోని కోస్ట్ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు.. కొన్ని రోజుల క్రితం రాత్రి పూట సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. స్టీమర్ తో వేట సాగిస్తుండగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి సముద్రం నుంచి ఓ వింత జీవి బయటకు వచ్చింది. బోటును వెంటాడసాగింది. స్టీమర్ వేగంతో పోటీ పడుతూ మరీ నీళ్ల మీద ఎగురుతూ దాన్ని వెంబడించింది. ఆ జీవి నీట నుంచి బయటకు వచ్చిన ప్రతి సారి దాని కళ్లు మెరుస్తూ కనిపించాయి. ఈ వింత జీవి విన్యాసాలను ఆ వ్యక్తి తన కెమరాలో రికార్డు చేశాడు. దీన్ని ఓ ట్విటర్ యూజర్ తన అకౌంట్ లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన వారు.. ఏంటి ఈ వింత జీవి.. దీన్ని చూస్తే.. భయం వేస్తోంది అని కామెంట్ చేస్తున్నారు.