బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు విండో సీటు దగ్గర కూర్చోవాలని చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా విమానంలో ప్రయాణించే సమయంలో విండో సీటే కావాలని పట్టుబడతారు. అందుకోసం కాస్త ముందుగా బుకింగ్ చేసుకుంటారు కూడా. విండో సీట్ దగ్గర కూర్చుంటే అందమైన ప్రకృతిని దగ్గర నుంచి ఆస్వాదించొచ్చనేది వారి ఆలోచన. విమానాల్లో అయితే ఈ సీట్‌లో కూర్చుంటే మేఘాల పక్కనే ఉన్న ఫీలింగ్ కలుగుతుందని ప్యాసింజర్లు అంటుంటారు. అందుకేనేమో విండో సీట్ రాకపోతే అందులో కూర్చున్న వారిని బ్రతిమిలాడి మరీ ఆ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ విండో సీటు కోసం గొడవపడితే, అది కూడా రన్నింగ్ ఫ్లయిట్‌లో అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి!
బ్రెజిల్‌లోని గోఫస్ట్ ఎయిర్ లైన్‌లో ఇద్దరు మహిళా ప్యాసింజర్లు విండో సీటు కోసం బాహాబాహీకి దిగారు. వాస్తవానికి ఒక బిడ్డ తల్లి విండో సీటు కావాలని తన సహ ప్రయాణికురాలిని కోరింది. అందుకు ఆ ప్రయాణికురాలు తిరస్కరించింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా.. ఇద్దరూ జుట్లు పట్టుకుని దారుణంగా కొట్టుకునేంత వరకు వెళ్లింది. చివరికి ఫ్లయిట్ అటెండెంట్ స్వయంగా జోక్యం చేసుకుని గొడవను ఆపాల్సి వచ్చింది. ఆ విమానంలో మొత్తం 15 మంది ప్యాసింజర్లు గొడవకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఆ ప్రయాణికుల్ని విమానం నుంచి దింపేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం విమానం తన గమ్యస్థానానికి చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ప్యాసింజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Massive brawl breaks out on airline flight to Brazil… over a window seat. pic.twitter.com/zTMZPYzzDy
— Mike Sington (@MikeSington) February 3, 2023