చాలామంది అనేక సందర్భాల్లో అనేక నేరాలు చేసి జైలు పాలవుతుంటారు. కొంత మాత్రం ఏ నేరం చేయకున్న ఆరోపణలతో జైలుకు వెళ్తారు. మరికొందరు మాత్రం.. అతి తెలివి చూపించి విచిత్ర పనులు చేస్తుంటారు. అవి కాస్తా బెడిసి కొట్టి చివరకు కటకటాల పాలవుతారు. తాజాగా ఓ యువకుడు అలానే విచిత్రంగా చాక్లెట్ కోసం వెళ్లి జైలు పాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఇమాన్ హుస్సెన్ అనే బంగ్లాదేశ్ కు చెందిన యువకుడు. భారత్ సరిహద్దులో ఉండే షాట్డా నది సమీపంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటాడు. అతనికి భారత్ లో దొరికే చాక్లెట్లు అంటే ఇమాన్ కు చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు వాటి కోసం త్రిపుర రాష్ట్రంలోని సిపాహీజలా జిల్లాలోని కలామ్‌చౌరా గ్రామానికి వస్తుండేవాడు. ఈ ప్రయాణం అంత సాఫీగా ఏం సాగేది కాదు. ఇలా కొన్నాళ్ల పాటు పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా చాక్లెట్ కోసం ఈ సాహసం చేసేవాడు ఇమాన్. మొదట షాల్డా నదిని ఈది, భారత్ వైపునకు వచ్చేవాడు. తర్వాత సరిహద్దు కంచెలో ఎక్కడైనా రంధ్రాలు ఉన్నాయేమో చూసుకుని.. జాగ్రత్తగా భారత్‌లోకి ‘చొరబడేవాడు’.
దగ్గర్లోని దుకాణంలో చాక్లెట్ కొనుక్కుని అదే దారిలో తిరిగి వెళ్లిపోయేవాడు. ఇలా సాగిపోతున్న ఇమాన్ యాత్రకు బ్రేక్ పడింది. ఇటీవల మరోసారి అక్రమంగా బోర్డర్ దాటుతున్న ఇమాన్‌ను సరిహద్దు భద్రతా దళం పట్టుకుంది. న్యాయస్థానం ఇమాన్‌కు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.”బంగ్లాదేశ్ కోమిల్లా జిల్లాకు చెందిన బాలుడు చాక్లెట్ కొనుక్కునేందుకు భారత్‌లోకి చొరబడినట్లు విచారణలో అంగీకరించాడు.మరోవైపు.. ఇమాన్ కుటుంబసభ్యులు ఎవరూ భారత అధికారుల్ని ఇంకా సంప్రదించలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.