ఎవరైనా పట్టుదలతో సంపాదిస్తారు, ఇతను బట్టతలతో ఏకంగా 71 లక్షల రూపాయలు సంపాదించాడు. బట్టతల వల్ల దమ్మిడీ లాభం లేదని వెక్కిరించే సమాజం ఆఫ్ ప్రపంచం ఉన్న ఈరోజుల్లో అదే బట్టతలతో 70 లక్షలు సంపాదించడం అంటే మామూలు విషయమా? ఆ మహానుభావుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా?
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని విన్నాం. పట్టుదలతో పని చేస్తే ధనవంతులవుతారనీ విన్నాం. కానీ బట్టతలతో కూడా లక్షలు సంపాదించవచ్చునని ఈ పెద్దాయన రుజువు చేశాడు. కనీసం విగ్గులతో అయినా డబ్బులు సంపాదించారంటే నమ్మశక్యంగా అనిపిస్తుంది. కానీ బట్టతలతో లక్షలు సంపాదించడం ఏంటి.. టూమచ్ కాకపోతే అని అనిపిస్తుంది కదూ. కానీ ఇది నిజం. అతనికున్న బట్టతలే లక్షలు తెచ్చిపెట్టింది. ఇందులో చిన్న తిరకాసు ఉందండోయ్. చాలా అవమానాలు పడాల్సి ఉంటుంది. కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇతను కూడా అలానే అవమానాలు భరించాడు, కొన్ని కోల్పోయాడు. చివరికి 71 లక్షలు సంపాదించాడు. అలా అని ఇతనేమీ వ్యాపారం చేయలేదు సుమీ.
లోపం ఉన్నవారు అనేకమంది లోకాన్నే జయిస్తున్నారు. లోపాన్ని అయ్యో పాపం అని జాలిపడే మనుషులు ఉన్న లోకంలో ఎంతోమంది తమ లోపాన్ని ఆయుధంగా చేసుకుని తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. కాళ్ళు లేని వాళ్ళు నడవడమే కష్టం అనుకుంటే.. పరుగుల పోటీల్లో పాల్గొని విజయకేతనం ఎగురవేస్తున్నారు. మనిషిలో లోపం చూసినవాళ్లదే నిజమైన లోపం అని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. అయినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల లోపాన్ని చూసి నవ్వుకోవడం, వివక్ష చూపడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. బట్టతల ఏమైనా పెద్ద లోపమా? బట్టతల ఉందని ఒక ఉద్యోగిని ఒక కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. మరి ఆ ఉద్యోగి ఊరుకుంటాడా? పని చేయడం లేదంటే తీసేసినా అర్థం ఉంది.. కానీ బట్టతల ఉందని పనిలోంచి తీసేయడమేంటి అని అతను కోర్టుకెక్కాడు. ఈ ఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.
ఇంగ్లాండ్ కు చెందిన మార్క్ జోన్స్ అనే వ్యక్తి.. లీడ్స్ నగరంలోని టాంగో నెట్వర్క్ అనే మొబైల్ ఫోన్ సంస్థలో సేల్స్ డైరెక్టర్ గా ఉద్యోగం చేసేవాడు. వయసు 61 ఏళ్ళు. మరి ఆ వయసులో పొట్ట, బట్ట రావడం సహజమే కదా. అది అర్థం చేసుకోకుండా బాస్.. బట్టతల ఉన్నవాళ్లు నా టీమ్ లో ఉండడానికి వీల్లేదు అంటూ జాబ్ లోంచి తీసేశాడట. తన టీంలో 50 ఏళ్ళు పైబడ్డ బట్టతల ఉన్న వాళ్ళు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాడు. బట్టతల సాకుతో కారణంతో మార్క్ జోన్స్ కి ఇంటూ మార్క్ పెట్టేశాడు. దీంతో హర్ట్ అయిన మార్క్ జోన్స్.. తన బాస్ ఫిలిప్ హెస్కెట్ పై కోర్టులో పిటిషన్ వేశాడు. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ టాంగో నెట్వర్క్ కంపెనీపై పరువు నష్టం దావా వేశాడు. దీనిపై విచారణ జరిపిన స్థానిక కోర్టు.. మార్క్ జోన్స్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
మార్క్ జోన్స్ ని కారణం లేకుండా.. వివక్ష పూరితంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు టాంగో కంపెనీ 71 వేల పౌండ్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. భారత కరెన్సీ ప్రకారం.. సదరు కంపెనీ మార్క్ జోన్స్ కి రూ. 71 లక్షల 84 వేల చిల్లర సమర్పించుకోవాల్సి వచ్చింది. విడ్డూరం ఏంటంటే.. జోన్స్ ను ఉద్యోగం లోంచి తీసేసిన బాస్ కి కూడా బట్టతల ఉందట. బట్టతల ఉన్నవారు భాగ్యవంతులు అన్న సామెత ఉంది. ఇంగ్లాండ్ లో జరిగిన సంఘటన చూస్తుంటే ఆ సామెత నిజమే కాబోలు అనిపిస్తుంది. మరి బట్టతల ఉందన్న కారణంగా ఉద్యోగం నుంచి తొలగించిన బాస్ పై.. బాస్ పై, కంపెనీపై పరువు నష్టం దావా వేసి 71 లక్షలు సంపాదించిన మార్క్ జోన్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Mark Jones, a former sales director, won a claim for unfair dismissal involving direct age discrimination and harassment claims.
The ruling said he was wrongfully fired from his £60,000 ($72,500) a-year role while in his 60s and awarded £71,441 in damages https://t.co/0tEZXg4Cg3
— Bloomberg (@business) February 10, 2023