మత్స్యకారుల పడవ బోల్తా పడి 79 మంది మృతి చెందారు. వందల మంది గల్లంతయ్యారు.
వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే నైజీరియాలో పెళ్ళికి హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా పడవ బోల్తా పడి వందకు పైగా మరణించారు. చాలా మంది మిస్ అయ్యారు. ఈ ఘటన మరువక ముందే మరొక విషాదం నెలకొంది. మత్స్యకారుల పడవ బోల్తా పడింది. 79 మంది ప్రాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. కిక్కిరిసిపోయిన జనంతో వెళ్తున్న మత్స్యకారుల పడవలో ఇంజిన్ దెబ్బ తినడంతో ఈ విషాదం నెలకొంది. 10 నుంచి 15 నిమిషాల్లో పడవ పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. విషయం తెలిసిన కోస్ట్ గార్డ్ అధికారులు, రెస్యూ సిబ్బంది కాపాడే ప్రయత్నం చేసినా గానీ బలమైన గాలుల కారణంగా కాపాడలేకపోయారు. దీంతో 79 మంది జలసమాధి అయ్యారు. వందలాది మంది గల్లంతయ్యారు.
ఆ సమయంలో పడవలో 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. అవుటర్ డెక్ మీద చాలా మంది ఉన్నారని, వారంతా ఒక చివరకు రావడంలో ఒరిగిందని కోస్ట్ గార్డ్ వెల్లడించాడు. లిబియా నుండి యూరప్ కి బయలుదేరిన పడవలో ఈజిప్టు, సిరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనాకి చెందిన శరణార్థులు ఉన్నారు. మొత్తం 104 మందిని రక్షించగా.. 79 మంది మృతి చెందారు. వీరంతా బతుకు జీవుడా అంటూ బతుకుదెరువు కోసం యూరప్ కి వలసపోతున్న శరణార్థులు.
పెలోపోన్నిస్ సముద్ర తీరానికి 75 కి.మీ. దూరంలో రాత్రి సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి 104 మందిని రక్షించగలిగారు. వీళ్ళలో కొంతమందికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. వందలాది మంది మిస్ అయ్యారు. 79 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 6 సముద్ర తీర గస్తీ నౌకలు, నావికాదళ యుద్ధ నౌక, సైనిక రవాణా విమానం, వాయుసేన హెలికాప్టర్, ప్రైవేట్ పడవలు, డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలను చేపడుతున్నారు.
ग्रीक में शरणार्थियों से भरी नाव पलटी, अब तक 80 की मौत, कई लापता! #ship #Greece #Italy #Libya pic.twitter.com/h8Zzk68xiV
— indiagramnews (@indiagramnews1) June 15, 2023