ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ కో- ఫౌండర్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించారు. అయితే అదెలా సాధ్యం అని అందరికీ అనుమానం కలగచ్చు. బిల్ గేట్స్ దాతృత్వం గురించి అందరికీ తెలిసిందే. రెండు దశాబ్దాల నుంచి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు.
ఇప్పుడు ఆయన మహా దాతృత్వవాదిగా మారేందుకు పూనుకున్నారు. ఆయన ఆస్తి నుంచి మరో 20 బిలియన్ డాలర్లు(సుమారు లక్షన్నర కోట్లు) గేట్స్ ఫౌండేషన్ కు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తన పర్సనల్ బ్లాగ్ లో తెలియజేశారు. ఆ 20 బిలియన్ డాలర్లతో కలుపుకుని గేట్స్ ఫౌండేషన్ విరాళాల విలువ 70 బిలియన్ డాలర్లకు చేరనుంది.
ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు చేసే స్థాయి నుంచి.. కరోనాకి ముందు సంవత్సరానికి 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేసే స్థాయికి గేట్స్ ఫౌండేషన్ ను చేర్చారు. కరోనా కష్టకాలంలోనూ ఈ పౌండేషన్ ఏటా 2 బిలియన్ డాలర్లు ప్రజాహితం కోసం ఖర్చు చేసింది. గేట్స్ ఫౌండేషన్ గురించి మాట్లాడుతూ.. “ఇప్పుడు ఇచ్చే 20 బిలియన్ డాలర్లతో ఫౌండేషన్ విరాళాల విలువ 70 బిలియన్ డాలర్లకు చేరుతుంది. 2026 నాటికి ఏటా 9 బిలియన్ డాలర్లు ఖర్చుచేసే స్థాయికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం కరోనా, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం ఎన్నో కష్టాలను ఎదుర్కుంటోంది. ఇలాంటి సమయంలో మన భాగస్వామ్యం కూడా మరింత పెరగాలి” అంటూ బిల్ గేట్స్ పేర్కొన్నారు.
బిల్ గేట్స్ ప్రస్తుతం 113 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇలాంటి విరాళాలతో త్వరలోనే ఆ జాబితా నుంచి బయటకు రావాలని చూస్తున్నట్లు బిల్ గేట్స్ వెల్లడించారు. బిల్ గేట్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Several huge global setbacks over the past few years have left many people discouraged and wondering whether the world is destined to get worse.
— Bill Gates (@BillGates) July 13, 2022