సూర్యుడి గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. ఇప్పటికే సూర్యుడికి సంబంధించిన అనేక విషయాలను ప్రపంచానికి తెలియజేశారు. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు సూర్యుడికి సంబంధించి ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు.
భూమికి అతి దగ్గర ఉన్న నక్షత్రం సూర్యుడు. మన భౌతిక దృష్టితో చూస్తే నిరంతరం మండే అగ్నిగోళం ఈ సూర్యుడు. మనకు వెలుతురు, వేడికి ముఖ్యకారణం ఈ నక్షత్రమే. కాలక్రమంలో సూర్యుడిలో అనేక మార్పులు, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అలానే సూర్యుడికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకునేందుకు వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే సూర్యుడికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అమెరికాకు చెందిన ‘నాసా’ శాస్త్రజ్ఞులు కొత్త విషయాన్ని కనుకున్నారు. సూర్యుడి ఉపరితలంపై ఓ భారీ బిలాన్ని వారు కనుగోన్నారు.
సూర్యుడిలో జరుగుతున్న అంతర్గత మార్పుల నేపథ్యంలో అక్కడ భారీ బిలం ఏర్పడినట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్చి 23వ తేదీన నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ నిపుణుల బృందం సూర్యుడిలోని కరోనా భాగంలో ఈ భారీ బిలం ఏర్పడిన విషయాన్ని గుర్తించింది. దీని పరిణామం భూమి కంటే 20 రేట్లుపైగా ఉందని నాసా శాస్త్రజ్ఞలు.. తమ పరిశోధనలో కనుగొన్నారు. ఇటీవల అమెరికా ప్రాంతంలోని ఆకాశంలో పలు రకాల వింత కాంతులుకు కనిపించాయి. వాటికి సూర్యుడి బాహ్యావలయ విస్పోటనంమే కారణమని నిపుణులు ఉంటున్నారు.
ఈ విస్పోటనంతో భూ అయాస్కాంత క్షేత్రాలకు ముప్పు వాటిల్లిందనే విషయం నిర్థారణ అయింది. తాజాగా భూమి పరిణామంలో ఈ భారీ బిలాన్ని సూర్యుడిపై గుర్తించారు. ఇది భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే సందేహం ప్రస్తుతం అందరిలో మొదలైంది. ఈ బిల్లం కారణంగా ఇంతకు ముందు సూర్యుడి ఉపరితలపై కనిపించే భాగం కనిపించని స్థితి ఏర్పడిందని నాసా చేసిన అధ్యాయనాలను వైస్ న్యూస్ తెలిపింది. సూర్యుడిలో ఏర్పడ్డ భారీ బిలంతో భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఎన్‌ఒఎఎ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఏర్పడ్డ ఈ భారీ బిలం నుంచి గంటకు 2.9 మిలియన్ వేగంతో భూమి వైపు సౌరగాలులు వీస్తున్నాయి.
ఇవి మరికొద్ది రోజుల్లో భూమిని తాకుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ సౌర గాలు ప్రభావం భూమిపై ఏ విధంగా ప్రభావం చూపుతాయి? ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంటుందా? ఒకవేళ విపత్కర పరిస్థితి వస్తే తట్టుకునేందుకు ఏమి చేయాలి?.. ఇలా పలు సందేహాలపై నిపుణులు పరిశీలిస్తున్నారు. సూర్యుడి నుంచి బాగా వేడెక్కిన కణజాలాలు నిరంతరం భూమివైపు దూసుకు వస్తే భూఅయస్కాంత క్షేత్రంపై ప్రభావం పడుతుంది. దీంతో భూమిపై పలు పరిణామాలు సంభవించవచ్చు.
ఈ బిలం ప్రభావం అనేది ముఖ్యంగా కృత్రిమ ఉపగ్రహాలు, స్మార్ట్ ఫోన్లు, జీపీఎస్‌పై ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు వాతావరణ మార్పుల కారణంగా భూమిపై అనేక రకాల సమస్యలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ భారీ బిలం ప్రభావంతో ఎలాంటి ప్రభావం భూమిపై ఉండబోతుందో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. మరి.. సూర్యుడికి సంబంధించిన వెలుగులోకి వచ్చిన ఈ కొత్త విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.