బెటర్.కామ్ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. జూమ్ మీటింగ్‌లోనే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఏకంగా 900 మందికి చేదువార్త చెప్పారు ఆ కంపెనీ సీఈఓ. బెటర్.కామ్ కంపెనీకి సీఈఓ అయిన ఇండో-అమెరికన్ విశాల్ గార్గ్ ఇటీవల ఆయన కంపెనీ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ పెట్టారు. పెర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ ఆధారంగా కొంత మంది ఉద్యోగులకు కాల్ షెడ్యూల్ చేశారు. వీడియో కాల్ మొదలయ్యాక.. సీఈవో విశాల్ మాట్లాడుతూ.. ఇప్పుడు మీకో షాకింగ్ న్యూస్ అన్నారు. ‘‘మీరు ఈ జూమ్ కాల్‌లో ఉన్నారంటే.. కంపెనీలోని దురదృష్టవంతుల్లో ఒకరని అర్థం. మిమ్మల్ని తక్షణం ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం” అని ప్రకటించారు.
Vishal Garg: “I wish I didn’t have to lay off 900 of you over a zoom call but I’m gonna lay y’all off right before the holidays lmfaooo”pic.twitter.com/6bxPGTemEG
— litquidity (@litcapital) December 5, 2021
మొత్తం మూడు నిమిషాల పాటు సాగిన వీడియో కాల్‌లో ఇదొక చాలెంజింగ్ నిర్ణయమని విశాల్ అన్నారు. తన కెరీర్‌లో ఇలా చేయడం రెండోసారి అని, అయితే ఇలా ఉద్యోగులను తీసేయడం తనకూ ఇష్టం లేదని, గతంలో ఇలా చేసినప్పడు తాను ఏడ్చేశానని చెప్పారు. అయితే ఈసారి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నానని, చాలా మంది ఉద్యోగులు సమర్థవంతంగా పని చేయడం లేదని, చాలా బద్ధంగా వ్యవహరిస్తున్నారని విశాల్ అన్నారు. అందుకే కంపెనీలోని 15 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఈ కాల్‌లో ఉన్నవారిలో 250 మంది ఉద్యోగులు ఎనిమిది గంటల షిఫ్ట్‌కు గానూ రెండు గంటలు కూడా పని చేయలేదని విశాల్ అన్నారు. కాగా ఈ మీటింగ్ వీడియోను ఓ ఉద్యోగి తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది.
లిట్‌క్విడిటీ అనే ట్విట్టర్ హ్యండిల్‌లో దానని పోస్ట్ చేశాడు. అయితే ఉద్యోగులను తీసేసిన సీఈఓ విశాల్ గార్గ్ మళ్లీ రిక్రూట్‌మెంట్ కోసం తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో పెట్టిన దానిని స్క్రీన్ షాట్ తీసి ఆ ఫొటోను కూడా ట్వీట్ చేశాడు. కాగా, ఆ వీడియోపై బెటర్.కామ్ కంపెనీ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఇప్పుడు 15 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సీఈఓ పొరబాటుగా చెప్పారని, నిజానికి తీసేసింది 9 శాతం ఉద్యోగులనేనని క్లారిటీ ఇచ్చారు. మరి ఒకేసారి 900 మంది ఉద్యోగులను ఉన్నపాటుగా తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.