చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయకండి.. అలా చేయడం వల్ల వారు మట్టిలో కలిసిపోతారు కానీ, లాభం ఉండదు. అదే మాకు అప్పగించనుకోండి.. తిరిగి ప్రాణం పొసే ప్రయత్నం చేస్తాం.. అంటోన్న జర్మన్ కంపెనీ.
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆవిష్కరణల వేగం పెరుగుతోంది. గతంలో ఏళ్ల తరబడి చేసే పనులు కూడా ప్రస్తుతం గంటల్లో, రోజుల్లో ముగించేస్తున్నారు. అసాధ్యం అనుకున్న ఎన్నో పనులను సాధించి చూపిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుత కంప్యూటర్ యుగంలో చేయలేని పనంటూ ఏదీ లేదని చాటి చెప్తున్నారు. ఈ మాటలను నిజం అనిపించేలా జర్మన్ కంపెనీ చేసిన ఓ ప్రకటన అందరని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఏం ప్రకటన చేసిందంటారా! చనిపోయిన వారి మృతదేహాలను వారికి అప్పగించమంటోంది. శవాలను తీసుకొని వాళ్ళేం చేస్తారు అనుకుంటున్నారా! తిరిగి ప్రాణం పోస్తారట.
జర్మనీ, బెర్లిన్‌కు చెందిన టుమారో బయోస్టాసిస్ అనే స్టార్టప్ సంస్థ చనిపోయిన వారికి ప్రాణం పొసే ప్రయోగాలు చేస్తోంది. అంటే.. పునర్జన్మ అందించే ప్రయత్నాలు అన్నమాట. అందుకోసం చనిపోయిన వారి మృతదేహాల కోసం అన్వేషిస్తోంది. “చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయకండి.. మాకు అప్పగించండి తిరిగి ప్రాణం పోస్తాం..” అంటూ ప్రజలను చైతన్యం కలిగేలా అవేర్ నెస్ కల్పిస్తోంది. ఇలా తీసుకున్న మృతదేహాలను వారు అత్యంత శీతల వాతావరణంలో భద్రపరుస్తారు. ఈ విధంగా చేయడం వల్ల శవ భాగాలు చాలా కాలం పాటు చెడిపోకుండా ఉంటాయి.ఈ విధానంలో కణాలు, కణజాలంతో పాటు మెదడును కూడా నిల్వ చేస్తారు.
మొదట అవయవాలను మైనస్ 196 డిగ్రీ సెల్సియస్ వద్ద చల్లబరిచి ఉంచుతారు. ఆ తర్వాత వాటిని లిక్విడ్ నైట్రోజెన్‌తో నింపి ఉన్న ట్యాంకులో భద్రపరుస్తారు. అనంతరం అవసరమైన సమయంలో వాటిని పరిశోధనకు ఉపయోగిస్తారు. అయితే, ఈ విధానంలో శరీర అవయవాలను భద్రపరచడం సాధ్యమే అయినప్పటికీ.. జీవంలేని అవయవాలను ఎలా పునరుద్ధరిస్తారనే విషయంపై క్లారిటీ లేదు. అందులోనూ వారు చెప్పిన దానిని బట్టి వైద్య విజ్ఞానం మరింత అభివృద్ధి చెందాక అంటున్నారు. అప్పటిదాకా ఈ శరీరాలను ఏం చేస్తారో అన్నది తెలియదు. అయినప్పటికీ.. వీరి సాహసాలకు మెచ్చి శవాలను వీరికి అప్పగించేందుకు జనాలు ముందుకొస్తున్నట్టు సమాచారం. చనిపోయిన వారికి తిరిగి ప్రాణం పోయొచ్చా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.