నేటికాలంలో కొందరు యువతీ యువకులు ట్రెండ్ పేరుతో చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండడంతో గుర్తింపు పొందడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు యువతీ యువకులు అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవలే ముంబై మెట్రో రైళ్లో ఓ యువతి అర్ధనగ్నంగా కనిపించి.. ప్రయాణికులను షాక్ కు గురి చేసింది. తాజాగా ఓ యువకుడు అందరి ముందు బట్టలు విప్పి రచ్చ రచ్చ చేశాడు.
నేటికాలంలో కొందరు యువతీ యువకులు ట్రెండ్ పేరుతో చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండడంతో గుర్తింపు పొందడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు యువతీ యువకులు అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవలే ముంబై మెట్రో రైళ్లో ఓ యువతి అర్ధనగ్నంగా కనిపించి.. ప్రయాణికులను షాక్ గురిచేసింది. మెట్రో రైల్లో యువతి వేష ధారణ చూసి అంతా అవాక్కయ్యారు. ఆమెకు తాను ఏమి తక్కువ కాదన్నట్లు మరో యువకుడు ఏకంగా మెట్రో రైళ్లు స్నానం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో కొందరు యువతీ యువకులు ట్రెండ్ పేరుతో శృతిమించి ప్రవర్తిస్తున్నారు. గతంలో ఓ యువతి మెట్రో రైల్లో డ్యాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. అలానే ఓ ప్రేమ జంట మెట్రో రైళ్లు అందరి ముందు లిప్ లాక్ కిస్ పెట్టుకున్నారు. ఇటీవలే ఓ యువతి అర్ధ నగ్నంగా మెట్రో రైళ్లు ఎక్కింది. ఫేమస్ అయ్యేందుకు ఇలా చిత్రవిచిత్రమైన వేషాలు వేస్తున్నారు. వీరందరికి గురువును నేనే అన్నాట్లు తాజాగా ఓ యువకుడు ఏకంగా మెట్రో రైళ్లో స్నానం చేశాడు. న్యూయార్క్ సిటీలోని మెట్రో రైళ్లో ఓ వ్యక్తి ప్రయాణీకుల ఎదుటే స్నానం చేశాడు.
మెట్రో రైళ్లు స్నానం చేసిన సదరు వ్యక్తి కంటెంట్ క్రియేటర్ ప్రిన్స్ జీగా గుర్తించారు. ఈ వీడియోలో ప్రిన్స్ జీ తనకు ఎదురుగా సూట్‌కేసును ఓపెన్ చేసి.. తన ఒంటిపై ఉండే దుస్తువులను విప్పడం ప్రారంభిస్తాడు. ఆపై సూట్‌కేసులో నిలబడి బ్రష్ తో రుద్దుకుంటూ స్నానం చేయడం కనిపిస్తుంది. అతడి పక్కన కూర్చున యువతులు.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ యువకుడు స్నానం పూర్తి చేసిన తర్వాత శరీరాన్ని శుభ్రంగా తుడుచుకుని తిరిగి బట్టలు వేసుకున్నాడు. ఇంతలో తాను దిగాల్సిన స్టేషన్ రావడంతో సూట్ కేసు పట్టుకుని ట్రైన దిగేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. వినోదభరితంగా ఉందని, అందరి ముఖాల్లో నవ్వులు పూయించిందని కొందరు వ్యాఖ్యానించగా, ఇది ఇబ్బందికరగా ఉందని మరికొందరు రాసుకొచ్చారు. ఈ వీడియోను ప్రిన్స్ జీ తన ఫేస్‌బుక్ అకౌంట్లో గత ఏడాది నవంబర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ పాత వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.