సాధారణంగా ఏనుగు చెవులు చాలా పెద్దగా చాటంత ఉంటాయి. అందుకే ఎవరికైనా కొంచెం పెద్ద చెవులు ఉంటే వామ్మో ఏనుగు చెవులురా వీడివి అంటుంటారు. అయితే కొన్ని జంతువులకు కూడా చెవులు పెద్దవిగా ఉంటాయి. కానీ ఓ చిన్న మేక పిల్లకు చెవులు చాంతాడంత ఉండటం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఒకదశలో ఈ మేక పిల్ల పుట్టినప్పుడు దానికంటే దాని చెవులే ఎక్కువ పొడవున్నాయట.. అందుకే ఈ మేక పిల్ల త్వరలో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతుంది. వివరాల్లోకి వెళితే..
పాకిస్తాన్‌లోని కరాచీలో మహమ్మద్ హాసన్ అనే రైతు ఇంట్లో రెండు వారాల క్రితం మేకపిల్ల పుట్టింది. సాధారణ మేక పిల్లలా కాకుండా దీనికి పుట్టినపుడే చెవులు పెద్దగా ఉండటం చూసి హసన్ ఆశ్చర్యపోయాడు. అయితే ఆ మేక పిల్లకన్నా దాని చెవులే పెద్దగా ఉన్నాయి. దీంతో ఆ మేక పిల్లకు సింబా అని పేరు పెట్టుకొని ఎంతో ముద్దుగా చూసుకుంటున్నాడు. సింబా మేక అంటే స్వాహిలిలో సింహం అని అర్ధం. ఈ మేక పిల్ల చెవులు 19 అంగుళాల పొడవున్నాయట. ఇక ఈ బుజ్జి పెద్ద చెవుల మేక పిల్లను చూడటానికి చుట్టుపక్కల జనాలు మహమ్మద్ హసన్ ఇంటికి క్యూ కడుతున్నారు.
సుబియన్ జాతికి చెందిన మేకలకు చెవులు పెద్దవిగా ఉంటాయి. కానీ సింబా విషయంలో ఇది కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు అని అంటున్నాడు దాని యజమాని మహమ్మద్. అయితే ఈ మేక పిల్ల చెవులు ఇంత పెద్దవిగా ఉండటానికి కారణం జన్యు మార్పిడిగానీ, ఏదైనా జెనెటిక్ సమస్యగానీ కారణం అయి వుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాటిల్ లో పాలు పట్టిస్తూ.. ఈ మేకపిల్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు దాని యజమాని మహమ్మద్ హసన్. ఈ బుజ్జి మేక పిల్లకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Baby goat “Simba” in Karachi, Pakistan has made a world record with its ears as long as 48 centimeters, very much longer than the normal size of ears.https://t.co/YM9lJZDNtw
📹: Yousuf Khan pic.twitter.com/z6kZnrbpwl
— Anadolu Images (@anadoluimages) June 17, 2022