ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా పయనిస్తుందని.. రాబోయో రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంద్యం సాకుగా చూపుతూ.. ఇప్పటికే పలు కంపెనీలు వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇలా ఉద్యోగులను తొలగించుకుంటున్న కంపెనీల జాబితాలో.. టాప్ ఎంఎన్‌సీలు కూడా ఉండటం గమనార్హం. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా చిన్నా.. పెద్ద కంపెనీలు.. ఉద్యోగులను తొలగించే ప్రయత్నంలో ఉండగా.. ఓ కంపెనీకి చెందిన బాస్ మాత్రం.. తన ఉద్యోగులకి క్రిస్మస్ సందర్భంగా ఏకంగా 80 లక్షల రూపాయలు బోనస్ ప్రకటించి.. వారిని సంతోషంతో ఉక్కిరికబిక్కిరి చేసింది. ఓవైపు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న బాస్‌లుండగా.. ఇలా లక్షలు లక్షలు బోన్‌లు ఇస్తున్న బాస్ ఎవరు అంటూ నెటిజనులు తెగ ఆలోచిస్తున్నారు. ఆ వివరాలు..
మైనింగ్ మొఘల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియాకు చెందిన జార్జినా హోప్ రెన్‌హార్ట్.. తన ఉద్యోగులకు ఇంత భారీ మొత్తం.. బోనస్‌గా చెల్లించి సర్‌ప్రైజ్ చేసింది. రెన్‌హార్ట్ ప్రస్తుతం ప్రోస్పెక్టింగ్ అనే మైనింగ్, అగ్రికల్చర్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, డైరెక్టర్‌గా పని చేస్తుంది. ఆస్ట్రేలియాలో అత్యంత ధనవంతురాలైన మహిళగా గుర్తింపు తెచ్చుకుంది రెన్‌హార్ట్. ఆమె సంపద ఏకంగా 34 బిలియన్ డాలర్లని నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో తాజాగా.. రెన్‌హార్ట్.. తన తండ్రి స్థాపించిన కంపెనీ హాన్ కాస్ ప్రోస్పెక్టింగ్‌కు చెందిన రాయల్‌హిల్ అనే మరో సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులతో అత్యవసర సమావేశం నిర్వహించింది.
చాలా సీరియస్‌గా ఈ సమావేశం ప్రారంభం అయ్యింది. ఇక మీటింగ్ సందర్భంగా రెన్‌హార్ట్.. 10 మంది పేర్లు బయటకు చదివి వినిపించింది. వారంతా భయంభయంగా లేచి నిల్చున్నారు. తమను ఉద్యోగాల నుంచి తీసేశారా ఏంటి అని టెన్షన్ పడసాగారు. ఇంతలో రెన్‌హార్ట్.. వారందరికి కంగ్రాట్స్ చెప్పింది. దేనికో మీటింగ్‌లో ఉన్నవారికి అర్థం కాలేదు. తర్వాత సీన్ ఏంటా అని అక్కడున్నవారంతా ఆత్రుతగా ఎదురు చూడసాగారు. ఇంతలో రెన్‌హార్ట్.. ఈ 10 మంది ఉద్యోగులకు లక్ష డాలర్లు.. అనగా ఏకంగా 80 లక్షల రూపాయలు బోనస్‌గా ఇస్తున్నట్లు ప్రకటించి.. వారిని ఆశ్చర్యపరిచింది.
ఈ వార్త విన్న ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఇలా బోనస్ అందుకున్న 10 మంది ఉద్యోగుల్లో.. ఒక వ్యక్తి.. కేవలం 3 నెలల క్రితమే కంపెనీలో చేరాడు. ఏడాది కాలంలో ఈ కంపెనీ 3.3 బిలియన్ డాలర్ల లాభాల్ని గడించిందని.. అందుకే ఉద్యోగులకు ఇలా లక్ష డాలర్లు.. బోనస్‌గా ఇచ్చానని రెన్‌హార్ట్ తెలిపింది. మరి ఈ లేడీ బాస్ చేసిన మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.