ఎన్నికలు ప్రచారాలు, పర్యటనల సమయంలో ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ నేతలపై దాడులు జరుగుతుంటాయి. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన జపాన్ ప్రధాని షింజో అబేపై మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో పనిచేసిన దుండగుడు యమగామి టెట్సుయా కాల్పులు చేసిన సంగతి విదితమే. ఆ కాల్పుల ఘటనలో షింజో మరణించారు. ఈ ఘటన మర్చిపోక ముందే కొత్త ప్రధానిపై బాంబు దాడి జరిగింది.
ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయాల్లోనూ, పర్యటనల్లోనూ, పలు కార్యక్రమాల్లో ప్రసంగించేందుకు ఏర్పాటు చేసిన వేదికల వద్ద వీరిపై కొంత మంది దుశ్చర్యకు పాల్పడుతున్నారు. గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో పాల్గొన్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను ఓ ఆగంతకుడు కాల్పులు జరపడంతో మరణించిన సంగతి విదితమే. మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటన గత ఏడాది జులైలో జరగ్గా.. 10 నెలలు కూడా తిరగకుండానే మరోసారి దాడి జరిగింది. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాపై బాంబు దాడి జరిగింది. ఇది కూడా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలోనే జరగడం గమనార్హం.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ జపాన్‌లోని వాకయామాలో ఆయన పర్యటిస్తున్నారు. అనంతరం ప్రసంగించేందుకు అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుంటున్న సమయంలో బాంబు పేలింది. దీంతో ఒక్కసారి ఉలిక్కిపడిన ప్రజలు అక్కడి నుండి పరుగులు తీశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రధానిని అక్కడి నుండి సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఆగంతకుడు స్మోక్ బాంబు విసిరినట్లు తేలింది. బాంబు దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది, పోలీసుల గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా, వార్తా చానల్స్‌లో ప్రసారం అవుతున్నాయి. జపాన్‌లో మరికొన్ని రోజుల్లో జీ 7 సమావేశాలు జరుగునున్న సమయంలో ఈ బాంబు దాడి జరగడం గమనార్హం.