ఉద్యోగాల కోతలు పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. కంపెనీ సిబ్బందిలో సుమారు 85 శాతం మందిని తొలగిస్తున్నట్లు ఓ దిగ్గజ కంపెనీ గురువారం ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు 675 మంది రోడ్డున పడనున్నారు. ఆ కంపెనీ ఏంటి..? ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలు, వృద్ధి మందగమనం నేపథ్యంలో రోజుకో కంపెనీ లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలోకి వర్జిన్ ఆర్బిట్ హోల్డింగ్స్ చేరిపోయింది. కంపెనీ సిబ్బందిలో సుమారు 85 శాతం మందిని తొలగిస్తున్నట్లు ‘వర్జిన్ ఆర్బిట్’ గురువారం ప్రకటన చేసింది. కొత్త పెట్టుబడులు లేకపోవడం, ఆర్థిక మందగమనం నేపథ్యంలోనే ఇలాంటిప్రకటన చేయాల్సి వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
అమెరికా, కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఈ వర్జిన్ గ్రూప్ రాకెట్లు తయారు చేస్తుంటుంది. ఇటీవల కాలంలో రిచర్డ్ బ్రాసన్స్ వర్జిన్ గ్రూప్ నేతృత్వంలోని ఈ కంపెనీ షేర్లు దాదాపు 38 శాతం మేర పడిపోయాయి. అందులోనూ.. ఈ ఏడాదిలో పెద్ద పెద్ద కంపెనీలు వరుసగా ఉద్యోగాల కోతలు చేపడుతుండడంతో వర్జిన్ ఆర్బిట్ అదే దారి ఎంచుకుంది. సిబ్బందిలో సుమారు 85 శాతం మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ గురువారం ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో దాదాపు 675 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ తొలగింపు నిర్ణయంతో కంపెనీ వారిపై ఖర్చు చేస్తున్న 15 మిలియన్ డాలర్లు ఆదా చేసుకోనుంది.
లేఆఫ్స్ ప్రకటన చేయకమునుపు వర్జిన్ ఆర్బిట్ మొత్తం సిబ్బంది.. 750. తాజాగా ప్రకటించిన ఉద్యోగాల కోతతో కంపెనీ సిబ్బంది సంఖ్య 100 లోపునకు పడిపోనుంది. ఈ కంపెనీ బ్లాంక్ చెక్ డీల్ ద్వారా 2021లో లిస్టింగ్‌లోకి వచ్చింది. ఇటీవల కాలంలో అంచనాకు తగ్గ ప్రాజెక్టులు రాకపోవడం, పైగా ఈ ఏడాది ప్రారంభంలో ఓ రాకెట్ విఫలమైన క్రమంలో కంపెనీపై ఒత్తిడి పెరిగింది. దీంతోనే ఉద్యోగాల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సిబ్బంది ఒకరు మీడియాకు వెల్లడించారు. మరోవైపు.. ఈ కంపెనీలో టెక్సాస్‌కు చెందిన మాథ్యూ బ్రౌన్ సంస్థ 200 మిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. ఆ చర్చలు విఫలమైనట్లు రాయిటర్స్ కథనం వెలువరించింది.
Billionaire Richard Branson-led Virgin Orbit will be shutting down its operations and will lay off 85% of its workforce, or 675 employees, as it failed to raise investment from investors.#VirginOrbit #layoffs #RichardBranson #Aerospace pic.twitter.com/WAhyfSPCxW
— Indian Startup News (@indstartupnews) March 31, 2023