ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి నిద్ర.. రెండు అందమైన మొగుడు డైలాగ్ గుర్తుందా? అలాంటి నిద్ర ప్రియులకు ఒక కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. వాళ్ల కంపెనీలో ఉద్యోగం ఇవ్వడమే కాదు.. హాయిగా నిద్రపోయినందుకు నెలకు లక్షల్లో జీతం కూడా ఆఫర్ చేస్తోంది. ఒకటి, రెండు కాదు ఏకంగా 25 లక్షల జీతం ఇస్తానంటోంది. నిజమండి బాబూ ఎక్కడ ఏంటో తెలుసుకోండి మరి.
కార్యాలయంలో నిద్రపోతే ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి ఉంటుంది. అదే నిద్రపోవడమే ఉద్యోగం అయితే వినడానికే భలే ఉంది కదూ. యూకే బేస్డ్ క్రాఫ్‌టెడ్ బెడ్స్ అనే లగ్జరీ బెడ్ కంపెనీ ఈ ఆఫర్ చేస్తోంది. వాళ్ల కంపెనీలో చేరే వాళ్లు కావాల్సినంత సేపు బెడ్ మీద కూర్చుని టీవీ చూడడం, హాయిగా నిద్రపోవడం చేస్తే చాలు. అధికారిక మాచారం ప్రకారం రోజులో కనీసం ఆ బెడ్‌పై 6 నుంచి 7 గంటలు గడపాల్సి ఉంటుంది. వారంలో కనీసం 37 గంటలపాటు బెడ్‌పై సమయం గడపాలి. ఆ బెడ్‌పై పడుకుని ఆ పరుపు ఎలా ఉంది. దానిపై గడిపిన సమయంలో ఏమైనా ఇబ్బంది కలిగిందా వంటి కోణాల్లో సమీక్షించాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగం చేయడానికి కార్యాలయానికి పరుగులు పెట్టాల్సిన పని కూడా లేదంట.. మీరు ఉద్యోంగలో చేరిన తర్వాత బెడ్‌ను వాళ్లే మీ ఇంటికి పంపిస్తారు. ఈ ఉద్యోగం చేసేందుకు జీతం అక్షరాలా 24 లక్షల 80 వేల రూపాయలు ఆఫర్ చేస్తోంది ఈ కంపెనీ. ఉద్యోగం చేయాలంటే కచ్చితంగా బ్రిటిష్ పౌరసత్వం మాత్రం తప్పనిసరి అంటోంది యాజమాన్యం. మనకు అవకాశం లేకపోయినా కానివ్వండి.. ఆ ఉద్యోగం ఎవరు చేస్తారో అనే జలసీ మాత్రం రాకపోదు. మన దగ్గర కూడా ఇలాంటి కష్ట పట్టకుండా చేసే ఉద్యోగాలు ఉంటే బాగుండు అంటూ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.