ప్రతి ఒక్కరు.. తాము చేసే పని పట్ల నిజాయితీని ప్రదర్శించాలి. అంతేకానీ ఎవరు తమని చూడటంలేదులే అని.. పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు కొందరు ఉద్యోగులు తాము చేసే పనిని ఎవరు గమనిచడం లేదని భావించి.. ఇష్టారీతిన ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఉద్యోగులు.. తమ అధికారులకు దొరికిపోవడం లేటు కావచ్చు కానీ దొరకడం మాత్రం పక్కాగా జరుగుతుంది. తాజాగా ఓ ఉద్యోగిని అలానే దొరికిపోయింది. కంపెనీ ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సౌలభ్యాన్ని ఆ ఉద్యోగిని దుర్వినియోగం చేసింది. ఈ క్రమంలో కంపెనీ అధికారులు ఆమెను గుర్తించి.. ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అంతే కాక కోర్టు ఆమెకు భారీ జరిమానా విధించారు. రూ. 3 లక్షలు చెల్లించాలని ఆ ఉద్యోగిని కోర్టు వారు అదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కోవిడ్ వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. దీంతో ఇంటి నుంచే స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం ఉద్యోగులకి లభించింది. అలానే బ్రిటిష్ కొలంబియాలోని ఓ సంస్థ కూడా తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని కల్పించింది. కెనాడకు చెందిన కార్లే బెస్సె అనే మహిళ ఆ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేసేవారు. అయితే, ఆ సంస్థ ఆమెను గతేడాది ఉద్యోగం నుంచి తొలగించేంది. ఉద్యోగం నుంచి తొలగించడానికి గల కారణం మాత్రం చెప్పలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు ఉద్యోగిని.. తనకు పరిహారం చెల్లించాలని సంస్థను డిమాండ్ చేసింది.
కంపెనీ వారు అందుకు ఒప్పుకోక పోవడంతో ఈ వ్యవహారం కాస్త కోర్టుకు చేరింది. ఈ క్రమంలో కోర్టులో ఇరువైపుల వాదోపవాదనలు జరిగాయి. తన వ్యక్తిగత సమాచారాన్ని ఎలా చూస్తారని సదరు మహిళ చేసిన ఆరోపణలను సంస్థ తోసిపుచ్చింది. కేవలం ఆఫీస్ డాక్యుమెంట్లను మాత్రమే తమ సాఫ్ట్ వేర్ పరిశీలిస్తుందని సంస్థ తెలిపింది. ఆ మహిళ 50 గంటల పాటు లాగిన్ అయినట్లు చూపించినప్పటికీ ఆ సమయంలో తనకు కేటాయించిన పని పూర్తి చేయలేదని సంస్థ కోర్టుకు వెల్లడించింది. అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు ముందు ఉంచింది. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి.. ఉద్యోగిని తొలగించిన విషయం పక్కన బెట్టి.. ఆఫీస్ సమయాన్ని వృథా చేసినందుకు అదిరిపోయే తీర్పు ఇచ్చింది.
సంస్థ నుంచి వివిధ రూపాల్లో పొందిన ప్రయోజనాల మొత్తం రూ.3 లక్షలు తిరిగి చెల్లించాలంటూ ఆ ఉద్యోగిని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కార్లే బెస్సె ఆఫీస్ టైంలో ఎక్కువగా కంప్యూటర్ దూరంగా ఉన్నట్లు తమ తనిఖీల్లో తేలిందని ఆసంస్థ వెల్లడించింది. చూశారా.. చేసిందే తప్పు.. ఇంకా దాన్ని సమర్ధించుకునేందుకు ఆ మాజీ ఉద్యోగిని ప్రయత్నం చేసింది. అంతేకాక సంస్థ నుంచి ఇంకా డబ్బులు రాబట్టాలనే ఓ దురాలోచనతో కోర్టు మెట్లు ఎక్కింది. ఆ కోర్టు సైతం ఆ ఉద్యోగిని నిజస్వరూపం తెలుసుకుని దిమ్మతిరిగే తీర్పు ఇచ్చింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.