ఇటీవల కాలంలో కొంత మంది సెలబ్రెటీలు చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెందడం.. జీవితంపై విరక్తితో ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అందరూ కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చేబుతూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ప్రముఖ సింగర్ తన ప్రియురాలిని గన్ తో కాల్చి తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించిది. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ర్యాపర్ జె స్టాష్ ఈయన అసలు పేరు జస్టిన్ జోసెఫ్.. జెనటీ గాలెగోస్ గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు.
ర్యాపర్ జస్టిన్ జోసెఫ్ ఎంతో మంచి పేరు సంపాదించారు. కొత్త ఎడాదికి స్వాగతం పలికేందుకు జస్టిన్ జోసెఫ్ ఆయన ప్రియురాలు జెనటీ గాలెగోస్ సన్నద్దం అయ్యారు. అంతలోనే వీరిద్దరూ గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో స్టాష్ ప్రేయసిని మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి గన్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కాల్పుల శబ్ధం రావడంతో గాలెగోస్ తనయులు వారి నాయనమ్మతో పాటు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
ఇది చదవండి : రైతుల మేలు కోసం యువతి అద్భుతమైన ఆలోచన!
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకోగానే ఇద్దరూ చనిపోయి ఉన్నారు. స్టాష్, గాలెగోస్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పిల్లల శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో వారిపై దాడి జరగలేదని నిర్ధారించారు.