ఈ మధ్యకాలంలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపం, వాతావరణం అనుకూలించకపోవడం, పక్షులు ఢీ కొట్టడం వంటి కారణాలతో విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇటీవలే నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మరణించారు. తాజాగా అమెరికాలోనూ అలాంటి ప్రమాదం చోటుచేసుకుంది. అయితే..
ఈ మధ్యకాలంలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపం, వాతావరణం అనుకూలించకపోవడం, పక్షులు ఢీ కొట్టడం వంటి కారణాలతో విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇటీవలే నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మరణించారు. ఆ తరువాత జరిగిన కొన్ని హెలికాప్టర్ ప్రమాదాల్లో పలువురు మరణించారు. తాజాగా ఆమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. అందులేనే ప్రయాణికులందరూ ఆందోళన గురయ్యారు. వెంటనే విమాన సిబ్బంది స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
అమెరికాలోని ఓహియో విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 23న బోయింగ్ 737 ఫ్లైట్ ఫినిక్స్ కు బయలుదేరింది. టేకాఫ్ అయిన అరగంటలోనే విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఓ పక్షి ఢీకొట్టడంతో ఆ విమానంలో మంటలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. చూస్తుండగానే ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని ప్రయాణికులకు గురైనట్లు సమాచారం. అయితే అందులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేదానిపై స్పష్టత లేదు.
ఉదయం 7.35కి టేకాఫ్ అయిన విమానంలో అరగంటలోనే ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమానం సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. వారందరిని విమానంలో వారిని పంపిచామని చెప్పారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనతో ఓహియోలోని జాన్ గ్లెన్ కొలంబస్ ఎయిర్ పోర్టులోనూ అత్యవసర స్థితిని ప్రకటించారు.
అంతే కాకుండా విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యేంత వరకూ ఇతర విమానాల రాకపోకలను నిలిపేశారు. ఫ్లైట్ ల్యాండయిన వెంటనే సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉన్న విమానం ఇంజన్ కు నిప్పంటుకున్న దృశ్యాలు ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. ఇటీవలే మధ్యప్రదేశ్ లో కూడా హెలికాఫ్టర్ కుప్పకూలి పలువురు మృతి చెందారు. ఇలా తరచూ విమానాల ప్రమాదాలు అందరిలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మరి.. అమెరికాలో జరిగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
@FAANews I just saw AA1958 with major engine issues just after take off. Flames shooting from the engine and wonky, pulsing noises from the aircraft.
— CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023