ఆమె ఆ 13 ఏళ్ల బాలుడితో స్నేహం చేసుకుంది. తినడానికి బిస్కట్లు, పిప్పరమెంటు బిళ్లలు ఇచ్చింది. తర్వాత ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. తర్వాత ఆమె అతడికి వాట్సాప్‌కు పాడు వీడియోలు పంపి...
మనుషుల్లో నేర ప్రవృత్తి బాగా పెరుగుతోంది. స్వల్ప కాలిక సంతోషాల కోసం నేరాలకు పాల్పడే వారు సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా, ఓ యువతి తన శారీరక సుఖం కోసం ఓ బాలుడ్ని వేధింపులకు గురి చేసింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమెరికాలోని విస్కిన్‌సిన్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు తన అత్తగారింట్లో ఉంటున్నాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల కైట్లిన్ స్కార్‌తో పరిచయం అయింది. స్కారే స్వయంగా బాలుడిని పలకరించింది.
తినడానికి బిస్కట్లు, పిప్పిరమెంటు బిళ్లలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. తర్వాత వాట్సాప్ ద్వారా అతడి పోర్న్ వీడియో పంపటం మొదలుపెట్టింది. తనతో శృంగారంలో పాల్గొనేలా అతడ్ని ప్రోత్సహించింది. ఇద్దరూ ఓ మూడు సార్లు శృంగారంలో పాల్గొన్నారు. తర్వాత కూడా తనతో శృంగారంలో పాల్గొనాలని ఆమె బాలుడ్ని ఇబ్బంది పెట్టింది. దీంతో బాలుడు ఇబ్బంది పడ్డాడు. ఆమె ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం మానేశాడు. ఆమెను దూరం పెట్టసాగాడు. మెసెజ్‌లకు కూడా రిప్లై ఇవ్వటం మానేశాడు. తర్వాత ఈ విషయం ఆమె తల్లికి తెలిసింది.
బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో.. సదరు బాలుడి వయసు 13 సంవత్సరాలు కాగా.. ఆమెతో 16 సంవత్సరాలు అని అబద్ధం చెప్పినట్లు తేలింది. అతడి వయసు 13 సంవత్సరాలు అని తెలియకపోవటం కారణంగానే ఆమె, అతడితో అలా ప్రవర్తించినట్లు వెల్లడైంది. తాజాగా, కోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది. స్కార్‌కు 65 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరి, తన శారీరక సుఖం కోసం స్కార్ 13 ఏళ్ల బాలుడిని వేధించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.