ప్రపంచంలో అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరణించిన తర్వాత ఆ స్థానంలోకి అయ్‌మన్ అల్ జవహరి వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా అల్‌ఖైదా అధినేత అయ్‌మన్ అల్ జవహరి హతమయ్యారు. అమెరికా దాడుల్లో అల్‌ఖైదా నాయకుడు అల్‌జవహరిని చంపేసినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిగిన డ్రోన్ దాడిలో జవహరీని అంతమొందిందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అల్ జవహరిని మట్టుబెట్టినట్లు జో బైడెన్ పేర్కొన్నారు.
అమెరికా టవర్స్ పై విమానంతో జరిగిన దారుణ ఘటనకు సూత్రధారుల్లో ఒకరిగా అల్-జవహరీని అమెరికా గుర్తించింది. ఈ దారుణ ఘటనలో వేలల్లో చనిపోయారు.. ఎంతో మంది గాయపడ్డారు.. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన విషాదాన్ని మిగిల్చింది. 2011లో ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా దళాలు హతమార్చిన తర్వాత అల్-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. వైద్యుడిగా ఉన్న జవహారీ తర్వాత అల్ ఖైదాలో ముఖ్య నాయకుడు అయ్యాడు. అప్పటి నుంచి జవహారి ని టార్గెట్ చేసి మట్టుబెట్టే ప్రయత్నాలు కొనసాగించింది అమెరికా.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్విట్టర్ వేదికగా.. ఆల్-జవహరీ 9/11 తీవ్రవాద దాడుల ప్రణాళికలో పాల్గొన్నాడని జో బిడెన్ నొక్కి చెప్పారు… చివరకు న్యాయం జరిగింది. 9/11 దాడిలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.. వారి కుటుంబాలు ఎంతో ఆవేదన పడ్డాయి. ఎంత కాలం పట్టినా.. ఎక్కడ దాక్కున్నా.. మా ప్రజలకు ముప్పు వాటిల్లితే.. అమెరికా కనిపెట్టి చర్యలు తీసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఆపరేషన్ లో పౌరులెవరూ గాయపడలేదని బిడెన్ అన్నారు. గతంలో జవహరీ పై 25 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా గతంలో ప్రకటించింది.
On Saturday, at my direction, the United States successfully conducted an airstrike in Kabul, Afghanistan that killed the emir of al-Qa’ida: Ayman al-Zawahiri.
Justice has been delivered.
— President Biden (@POTUS) August 1, 2022
ఇదిలా ఉండగా, కాబుల్‌లోని షేర్పూర్ ప్రాంతంలోని ఓ నివాసంపై ‘వైమానిక దాడి’ జరిగినట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపిపారు. ఈ దాడిలో అల్‌ఖైదా చీఫ్ అమాన్ అల్-జవహరీను అమెరికా మట్టుబెట్టినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. జూలై 31 న కాబూల్ నగరంలోని షేర్పూర్ ప్రాంతంలోని నివాసంపై వైమానిక దాడి జరిగిందని.. ఈ దాడిలో జవహరి మరణించినట్లు వెల్లడించారు. దాడిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ముజాహిద్ ఖండించారు. దీంతో అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీ హతమైనట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tonight at 7:30 PM ET, President Biden will deliver remarks on a successful counterterrorism operation.
— The White House (@WhiteHouse) August 1, 2022