సాంకేతిక లోపం లేదా మరే ఇతర కారణంగా విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ ప్రమాదాల్లో అప్పుడప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొన్ని సందర్భాల్లో విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో పెను ప్రమాదాలు తప్పుతాయి. తాజాగా ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మస్కట్ లో రన్ వే పై ఉన్న ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగాయి. రన్ వేపై బయల్దేరడానికి సిద్ధమవుతుండగా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విమానం మస్కట్ నుంచి కేరళలోని కొచ్చిన్ కి రావాల్సి ఉంది.
ఈ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్ వే పై ఉండగా ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి. దీంతో విమానం ఉన్న పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే అప్రమత్తమైన ఎయిపోర్టు అధికారులు విమానంలో ఉన్న ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని మస్కట్ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో 141 మంది ప్రయాణికులు, ఆరుగ్గురు క్రూ సిబ్బంది ఉన్నట్లు ఎయిపోర్టు అధికారులు తెలిపారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Just in :
– Passengers evacuated via slides after smoke on Air India Express Muscat-Cochin flight IX-442, VT-AXZ.
– There were 141 passengers plus 6 crew onboard and all are safe.@FlyWithIX pic.twitter.com/ufkvbk36hI
— Tarun Shukla (@shukla_tarun) September 14, 2022
All passengers were safely evacuated after smoke was detected in engine no. 2 of Air India Express flight (to Cochin) on the runway at Muscat airport. Relief flight to be arranged. We will investigate the incident and also take appropriate action: DGCA pic.twitter.com/L7w9yX4GrH
— ANI (@ANI) September 14, 2022