ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలాంటి ప్రశ్నలకైనా టక్కున ఆన్సర్లు చెప్పేస్తున్న 'చాట్ జీపీటీ'పై నిషేధం వేటు పడింది. ఇంతకీ ఈ టూల్ నిషేధం విధించేంత తప్పు ఏం చేసింది అనుకునుంటున్నారా..? కస్టమర్ల వివరాలు అక్రమంగా సేకరిస్తోందట.. ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ కూడా సరిగా లేదట. వీటిని కారణాలుగా చూపుతూ దీనిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలాంటి ప్రశ్నలకైనా టక్కున సమాధానాలు చెప్పేస్తున్న ‘చాట్ జీపీటీ‘ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి అందరకీ విదితమే. అడిగిన సమాచారాన్ని కచ్చితత్వంతో సమాధానం ఇవ్వడం దీని స్పెషాలిటీ. తప్పుగా అడిగారో.. తప్పనీ చెప్తోంది. కాకుంటే దీనిపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని దెబ్బకు ఎందరి ఉద్యోగాలు ఊడతాయో అని భయపడేవారు కొందరైతే, రానున్న రోజుల్లో ఇది రోబో సినిమాలో ‘చిట్టీ’ క్యారెక్టర్ లా మారుతుందేమో అని భయపడేవారు మరికొందరు. ఇలాంటి సమయాన చాట్‌జీపీటీని తమ దేశంలో బ్యాన్ చేస్తున్నట్లు ఇటలీ ప్రకటించింది.
చాట్ జీపీటీ.. దీని పేరులోనే విషయమంతా దాగుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో పనిచేసే ఈ అడ్వాన్స్‌డ్ సెర్చ్ చాట్‌బోట్ పైనే ఇప్పుడు అంతటా డిస్కషన్. ఆర్టికల్స్ రాసివ్వడం, సాఫ్ట్‌వేర్స్‌కు కోడింగ్ రాయడం, కథలు రాయడం, మ్యూజిక్ లిరిక్స్ జనరేట్ చేయడం వంటి పనులన్నీ చకచకా చేస్తుంది. ఇంకా కావాలంటే వీటన్నింటిలో మనం ఇచ్చే కమాండ్ ఆధారంగా మార్పులు కూడా చేస్తుంది. ఇలా ఈ టూల్ అన్ని పనులు సక్రమంగా చేస్తున్నా.. యూజర్స్ నుంచి రహస్యంగా వివరాలు సేకరిస్తోందన్నది ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ప్రధాన వాదన. అలాగే, ఈ చాట్‌బాట్ 13 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉండాలని ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ చెప్తోంది.
ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ.. చాట్ జీపీటీపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ టూల్ కస్టమర్ల వివరాలు అనధికారికంగా సేకరించడమే కాకుండా, సరైన వయస్సు నిర్ధారణ సిస్టమ్ కూడా లేదని అభిప్రాయపడింది. తక్కువ వయస్సున్న మైనర్లు ఈ టూల్‌కు ఎక్కువుగా ఆకర్షితులవుతుండడంతో.. ప్రైవసీ పరంగా ఈ టూల్ అంత సేఫ్ కాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఈ అడ్వాన్స్‌డ్ చాట్‌బాట్‌ను నిషేధించాలని నిర్ణయిం తీసుకున్నట్లు ఇటలీ ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై రెగ్యులేటర్లు…ఇప్పటికే కీలక ఆదేశాలిచ్చారు.
Italy’s data protection authority has temporarily banned the use of OpenAI’s ChatGPT in the country, citing concerns over the way the artificial intelligence tool collects and handles user data.
Read more: https://t.co/8zJpvdABsU#ChatGPT #Italy #OpenAIChatGPT pic.twitter.com/dHJp5RaKOb
— BeingAussie (@beingaussieblog) April 1, 2023
దేశంలో ఎవరూ చాట్ జీపీటీ యాక్సెస్ చేయడానికి వీల్లేకుండా నియంత్రించాలని తేల్చి చెప్పారు. ఈలోగా చాట్ జీపీటీ కంపెనీ తమ వాదనలు వినిపించవచ్చని తెలిపింది. అందుకోసం 20 రోజుల గడువిచ్చింది. డేటాను అక్రమంగా సేకరించడం లేదని నిరూపించుకుంటే.. ఈ బ్యాన్ ఎత్తేసే అవకాశముంది. ప్రస్తుతం భారత్‌లో ఈ టూల్ అందుబాటులో ఉన్నప్పటికీ…చైనా, నార్త్ కొరియా, రష్యా, ఇరాన్ వంటి కొన్ని దేశాలలో మాత్రం యాక్సెస్ లేదు. ఏదేమైనా ఈ టెక్నాలజీని నిషేధించాలని కొందరు చెప్తుండగా.. అద్భుతమని మరికొందరు వాదిస్తున్నారు. చాట్ జీపీటీపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.