సామాన్యంగా మనకు ‘స్పైడర్ మ్యాన్’ అనగానే హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ మూవీ సిరీస్ గుర్తుకొస్తుంది. అంతెందుకు రీసెంట్ గా కూడా ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ చిత్రం రిలీజై ప్రేక్షకులను విశేషంగా ఆదరణ దక్కించుకుంటుంది. అయితే.. ఇంతవరకు మనం సినిమాలో స్పైడర్ మ్యాన్ అనే మనిషి రూపం మాత్రమే చూశాం.
కానీ తాజాగా స్పైడర్ మ్యాన్ అవతారంలో ఓ అరుదైన ఊసరవెల్లి(తొండ) ఇండియన్ ఫారెస్ట్ అధికారి కెమెరా కంటికి చిక్కింది. అచ్చంగా ‘స్పైడర్ మ్యాన్’ రంగులు పోలి దర్శనమిచ్చే సరికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్‌ఎస్) ఆఫీసర్ సుశాంత నంద ఫోటో క్లిక్ చేశారు. అలాగే ఆ ఊసరవెల్లి ఫోటోకి ‘రియల్ లైఫ్ స్పైడర్ మాన్’ అంటూ డిసెంబర్ 21న తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అయితే.. ఈ జాతి బల్లులు ఎక్కువగా టాంజానియా, రువాండా, కెన్యా దేశాల్లో కనిపిస్తుంటాయి. అయితే ఈ జాతి జీవిలో తల, భుజాలు ఎరుపు రంగులో ఉండగా.. మిగతా శరీరం నీలం రంగులో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఊసరవెల్లి(తొండ) నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తుంది. మీరు కూడా ఈ అరుదైన స్పైడర్ మ్యాన్ బల్లి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
Spider-Man in real life…
DYN that the Mwanza flat-headed rock agama, referred to sometimes as Spider-Man agama, climbs up vertical walls like the reel life spider man😊😊 pic.twitter.com/ydpZvFNUvY
— Susanta Nanda IFS (@susantananda3) December 21, 2021