దేవుడు ప్రతి చోటా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. అవతార పురుషుడైనా సరే.. అమ్మ ప్రేమను పొందడం కోసం తల్లిగర్భం ద్వారా భూమి మీద జన్మిస్తారని అంటారు. అమృతాన్ని మించినది అమ్మ ప్రేమ అంటారు. ఇక భారతీయ సంస్కృతి తల్లే ప్రథమ దైవం. ఆ తర్వతే మిగతా వారు. ఇక బిడ్డల కోసం అనునిత్యం తపించే మాతృమూర్తులెందరో ఈ లోకంలో ఉన్నారు. బిడ్డల మేలు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన తల్లులు ఎందరో. అయితే అందరూ మాతృమూర్తులు ఇలా ప్రేమను పంచే వారే ఉంటారా అంటే కాదు. వీరిలో కొందరు రాక్షస ప్రవృత్తి కలిగిన తల్లులు కూడా ఉంటారు. వారిని చూస్తే అమ్మ అనే పదానికే కళంకంలా అనిపిస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి తల్లుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శారీరక వాంఛలు తీర్చుకోవడం కోసం బిడ్డలు అడ్డంగా ఉన్నారని.. వారిని కడతేరుస్తున్న కసాయి తల్లులు పెరిగిపోతున్నారు. ఇక డబ్బుల కోసం బిడ్డలను అమ్ముకునే తల్లులు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు చదవబోయే కథనం కూడా ఈ కోవకు చెందినదే.
డబ్బుల కోసం కన్నతల్లి.. ఏడేళ్ల చిన్నారిని వ్యభివచార ముఠాకి అమ్మేసింది. తల్లే అంతటి దారుణానికి పాల్పడితే.. ఇక ఆ చిన్నారిని కాపాడేవారేవరుంటారు. అలా 5-6 ఏళ్ల పాటు నరకం అనుభవించింది. చివరకు ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో.. ఆ నరకకూపం నుంచి బయటపడింది. కానీ అక్కడే ఉంటే.. తల్లి ఎప్పటికైనా తన జీవితాన్ని నాశనం చేస్తుందని స్వచ్ఛంద సంస్థ వారికి విన్నవించుకుంది. వారు ఆ చిన్నారి ఆవేదనను అర్థం చేసుకుని.. భారత్‌లోని తమ ప్రతినిధికి.. ఆమె సంరక్షణ అందజేశారు. గతం గాయలను మాన్పుకుంటూ.. జీవితంలో ముందుకు సాగింది. కష్టపడి చదివింది. ఈ క్రమంలో పెద్ద చదువుల కోసం లండన్ వెళ్లే అవకాశం వచ్చింది. కానీ 20 లక్షల రూపాయల ఫీజు చెల్లించాలి. అంత మొత్తం తన దగ్గర లేదు. ఈ క్రమంలో తన కన్నీటి గాథను సోషల్ మీడియాలో షేర్ చేసి.. సాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. ఎందరో మానవతామూర్తులు ఆ యువతి కథ విని చలించిపోయి.. సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఫలితంగా ఆమె చదువుకు కావాల్సిన మొత్తం పోగయ్యింది. ప్రస్తుతం లండన్ వెళ్లి చదువు కొనసాగిస్తోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరిన యువకులు.. వీడియో వైరల్
ఏడేళ్లకే అమ్మకం…ఇంతటి నరకం అనుభవించిన ఆ యువతి పేరు లైలా రాసెక్. ఏడేళ్ల పసిమొగ్గను ఆమె తల్లి వ్యభిచార ముఠాకి అమ్మేసింది. బడికి వెళ్లి చదుకోవాల్సిన చిన్నారి.. కాస్త.. తల్లి ధనదాహానికి, మగాడి పశువాంఛకి బలయ్యింది. డబ్బులు తీసుకురాకుండా ఇంటికి వస్తే.. అన్న, మారుతండ్రి, తల్లి చితకబాదేవారు. అలా ఏడేళ్ల వయసులోనే నరకం అనుభవించింది. ఆదుకునే వారు లేదు. ఇక తన జీవితం ఇంతే అనుకుని.. జీవచ్ఛంలా బతకసాగింది. మగాడి పేరు విన్న.. వారి గొంతు వినిపించినా.. భయంతో గజగజ వణికిపోయేది. క్రమేపి.. అసలు మాట్లాడటం మానేసింది. శిలలా మారిపోయింది.
ఆదుకున్న స్వచ్ఛంద సంస్థ..
లైలా జీవితం ఇంత భయంకరంగా సాగుతున్న వేళ.. 2013లో ఆమె తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి సమాచారంతో వుమెన్ ఫర్ అఫ్గాన్ వుమెన్ అనే సంస్థ ప్రతినిధులు లైలాను అక్కున చేర్చుకున్నారు. బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. కౌన్సిలర్లు.. ఎన్నో నెలలు కష్టపడితే కానీ లైలా మాములూ మనిషి కాలేదు. తేరుకున్నాక తను కోరిన మొదటి కోరిక.. చదువుకుంటాను అని. ఆమె ఆసక్తి గమనించిన సంస్థ ప్రతినిధులు అందుకు ఏర్పాట్లు చేశారు. బాల్యం తిరిగి రావడంతో.. లైలా ఎంతో సంతోషించింది. ఉత్సాహంగా బడికి వెళ్లి రావడం.. చదువుకోవడం చేయసాగింది.
భారత్‌కు పయనం..ఇలా సాగిపోతున్న లైలా జీవితంలోకి తల్లి మళ్లీ ప్రవేశించింది. ఆమె ఉన్న చోటు కనిపెట్టి.. అక్కడకు వెళ్లి లైలాను తనతో రమ్మంది. అంతేకాక స్కూల్ దగ్గరకు వచ్చి ఎత్తుకెళ్తానని బెదిరించసాగింది. దాంతో లైలా భయపడి కొన్ని రోజుల పాటు బడికి కూడా వెళ్లలేదు. దాంతో సంస్థ ప్రతినిధులు.. ఆమెను అక్కడి నుంచి తలరించాలని భావించారు. ఆ సంస్థ ప్రతినిధికి చెన్నైకి చెందిన నిత్యానంద్ జయరామన్‌తో పరిచయం ఉంది. లైలా గాథ విన్న ఆమె.. చలించిపోయింది. ఆమెకు సంరక్షకురాలిలా ఉండేందుకు అంగీకరించింది. ఇక లైలాను తమిళనాడులోని కొడైకెనాల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చేర్చారు.
ఇది కూడా చదవండి: Note On Wall: ఇంటి గోడపై సూసైడ్ నోట్.. ‘తమ్ముడూ.. వీళ్లంతా మంచోళ్లు కాదు!’
ప్రారంభంలో ఇంగ్లీష్ అర్థం కాక ఇబ్బంది పడిన లైలా.. ఆ తర్వాత దాని మీద పట్టు సాధించి అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకుంది. ఢిల్లీ, చెన్నైలో విధ్యాభ్యాసం కొనసాగించింది. ఆ తర్వాత లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఆఫ్రికన్ అండ్ ఓరియంటల్ స్టడీస్‌లో ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో పీజీ చేయాలని భావించింది. ఆ సంస్థలో సీటొచ్చింది కానీ.. అక్కడకు వెళ్లి చదువు పూర్తి చేయాలంటే 20 లక్షలకు పైగా ఖర్చవుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు.
ఆదుకున్న క్రౌడ్ ఫండింగ్..అప్పుడు లైలా మదిలో మెదిలిన ఆలోచన క్రౌడ్ ఫండింగ్. మిలాప్ అనే ఎన్జీవో వెబ్‌సైట్ ద్వారా తన కథను ప్రపంచానికి వెల్లడించి.. బాసటగా నిలవాలని కోరింది. ఆమె గురించి తెలుసుకుని చలించిపోయిన ఎందరో.. మానవతా మూర్తులు.. లైలాకు ఆపన్న హస్తం అందించారు. ఆమె కోరుకున్న 20 లక్షలు వచ్చాయి. ఇటీవలే ఆమె లండన్ వెళ్లి.. ఆ విద్యా సంస్థలో చేరింది. అక్కడ చదువు పూర్తవగానే.. అఫ్గనిస్తాన్ వెళ్లి.. అక్కడ ఆడపిల్లల చదువుల కోసం కోసం పోరాడతానంటుంది లైలా. ఆమె కథ చదవిని ప్రతి ఒక్కరు మీరు స్ఫూర్తికే స్ఫూర్తి నింపారు.. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని ప్రశంసిస్తున్నారు. లైలా కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
ఇది కూడా చదవండి: HC Judge: వీడియో: ఇదేమైనా సినిమా హాలు అనుకుంటున్నారా? IAS అధికారిని ఏకిపారేసిన జడ్జి!