ఎగుమతులు, దిగుమతులను నిలిపేసిన తాలిబన్లు…
ఇతర దేశాలతో సంబంధాల విషయంలో కఠినం!
డ్రై ఫ్రూట్స్ కి విపరీతంగా పెరిగిపోయిన డిమాండ్!!.
భారత్ ఆర్ధిక ఆరోగ్య పరిస్థితుల మీద ప్రభావం…
అమెరికా బలగాలు ఆఫ్గన్ నుంచి వెనక్కు వెళ్లిపోయిన వారం వ్యవధిలోనే మొత్తం తాలిబన్లు హస్తగతం చేసుకోవడం అగ్రరాజ్యాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాలిబన్ల దురాక్రమణతో అఫ్గనిస్తాన్‌లో సంక్షోభం అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతోంది. ముఖ్యంగా భారత్‌తో వర్తక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని ఇదివరకే వర్తకవ్యాపార విశ్లేషకులు తేల్చేశారు.
ఈ నష్టం వాళ్లు ఊహించిన దానికంటే భారీగానే ఉండబోతోందని ఇప్పుడు ఒక అంచనాకి వస్తున్నారు. ఆఫ్గన్ నుంచి భారత్‌కు రావాల్సిన ఉత్పత్తులు రోడ్డు మార్గంలో పాకిస్థాన్ మీదుగా వస్తుంటాయి. ప్రస్తుతం తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో భారత వర్తకులకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పటికే పూర్తైన చెల్లింపులను సైతం నిలిపివేయడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.
ఇప్పటికే చాలావరకు ఉత్పత్తుల దిగుమతి ఆగిపోగా, మధ్యవర్తులతో సంబంధాలూ తెగిపోయాయని, వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు రద్దు అయినట్లు చాలామంది చెబుతున్నారని కొందరు చెబుతున్నారు. ఇందులో భారత్ దిగుమతుల విలువ 826 మిలియన్ డాలర్లు, ఎండు ద్రాక్ష, వాల్‌నట్, ఆల్మండ్, అంజీర్, పైన్, పిస్తా, ఎండు ఆప్రికాట్ బిజినెస్ కోట్లలో నడుస్తుంది. వీటితో పాటు తాజా ఆప్రికాట్, చెర్రీ, వాటర్ మిలన్, మూలికలు తదితరాలను దిగుమతి చేసుకుంటాయి.
ఆఫ్గాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా భారత్ కు వచ్చే ఎగుమతులను తాలిబన్లు అడ్డుకున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. అఫ్గాన్ తో భారత్ మంచి వ్యాపార సంబంధాలను కలిగి ఉంది. ఈ ఏడాది భారత్ నుంచి అఫ్గాన్ కు జరిగిన ఎగుమతుల విలువ 835 మిలియన్లు. అఫ్గాన్ లో ఇండియా 3 బిలియన్ల పెట్టుబడులు పెట్టడాన్ని బట్టి ఇరు దేశాల సంబంధాలను అర్థం చేసుకోవచ్చు.