ఇంకాసేపట్లో ల్యాండింగ్ అవుతుందనగా ఫ్లైట్‌లో పైలట్ తీవ్రంగా అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే ఓ ప్రయాణికురాలు అప్రమత్తమై.. ఆ విమానాన్ని కిందికి దించేందుకు ఆమె కంట్రోల్ చేసింది.
ఇంట్లో నుండి బయటికి వచ్చిన వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు ప్రాణాలపై నమ్మకం లేదు. చాలామంది అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారు. వాటి నివారణకు తగిన చర్యలు తీసుకున్నప్పటికిీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదాల నుండి కాపాడుకోవచ్చు. ఇటీవల ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదంలో ప్రయాణికులను అప్రమత్తం చేయడం వల్ల ప్రాణహాని జరగలేదు. ఇలాగే ప్రతి ఒక్కరు ఏదో ఓ ప్రమాదానికి గురి అవుతున్నారు. ప్రమాదాల బారిన పడి చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఓ ఫ్లైట్ గమ్యస్థానాన్ని చేరుకుంది. కొద్దిసేపట్లో ల్యాండింగ్ అవుతుందనే సమయంలో పైలట్ తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానంలో మహిళా ప్రయాణికురాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి.. సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
మసాచుసెట్స్ పోలీసుల కథనం ప్రకారం.. న్యూయార్క్‌లోని వెస్ట్‌చెస్టర్ కౌంటీ నుంచి విన్‌యార్డ్‌కు 2006 పైపర్ మెరీడియన్ అనే మినీ విమానం బయలుదేరింది. విన్‌యార్డ్ చేరుకుని ల్యాండింగ్ సమయంలో పైలట్(79)కు తీవ్రమైన అస్వస్థత ఏర్పడింది. దీంతో విమానంలో ఉన్న మహిళా ప్రయాణికురాలు ఫ్లైట్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకుంది. ఆ ప్రయత్నంలో విమానాన్ని సేఫ్‌గా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా రన్‌వేకు సమీపంలోనే ఓ వైపు ఓరిగిపోయింది. విమానం ఎడమవైపు ఉన్న రెక్క సగానికి విరిగిపోయింది. తక్షణమే అక్కడకు ఎమర్జెన్సీ రెస్క్యూ టీం చేరుకున్నారు. అందులోని పైలట్‌తోపాటుగా మహిళా ప్రయాణికురాలిని ఆస్పత్రికి తరలించారు. పైలట్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిపారు. మహిళ స్వల్ప గాయాలతో బయటపడిందని వెల్లడించారు.
ICYMI: Officials say that at 3:12 pm Saturday , a Piper Meridian Turbo Prop 6-seat plane reportedly crashed at the Martha’s Vineyard Airport, Massachusetts.
68-year-old female passenger took control of the plane after the craft’s 80-year-old pilot had a medical emergency pic.twitter.com/bNjCq6WToE— Anny (@anny25717503) July 16, 2023