నేటికాలంలో యువత సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడేస్తున్నారు. ముఖ్యంగా తాము ఫేమస్ అయ్యేందుకు పలు రకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు అయితే విచిత్రమైన పనులు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ యువకుడు కోటిన్నర డాలర్ల నోట్లను రోడ్డుపై విసిరేశాడు.
ప్రస్తుతం సోషల్ యుగం నడుస్తుంది. అలానే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా కొందరు యువత ఫేమస్ అయ్యేందుకు విచిత్రమైన పనులు చేస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీడియోలు చేస్తున్నారు. మరికొందరు రోడ్లపై డబ్బులు వెదజల్లుతు తమ వెర్రితనాన్ని చూపిస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ వీధిల్లో కొందరు యువకులు కారులో వెళ్తూ.. నోట్ల కట్టలు రోడ్డుపై విసిరారు. తాజాగా ఇంచుమించు అలాంటి ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. ఓ యువకుడు కోటిన్నర డాలర్లను రోడ్డుపై, ఇతర ప్రాంతాల్లో విసిరాడు. వాటి కోసం స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికాలోని ఓరేగాన్ ప్రాంతంలో హోలిన్ మెక్ డార్విన్ అనే యువకుడు రూ.1.6 కోట్ల విలువగా డాలర్ల నోట్లను రోడ్లపై విసిరేశాడు. బిజి బిజీగా ఉండే ఆ రోడ్లపైనే ఆ యువకుడు డాలర్ల వాన కురిపించాడు. ఇక వానకాలం నీటి కారణంగా ట్రాఫిక్ జామ్ అయినట్లు ఈ నోట్ల కోసం జనం ఎగబడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డాలర్ల కోసం స్థానికులు రోడ్లపైనే కాకుండా ఆ పక్కనే ఉన్న గడ్డి భూమి ప్రాంతంలో కూడా పడిన నోట్లను తీసుకున్నారు. ఇలా దొరికినకాడికి దొరికినంత స్థానికులు తీసుకెళ్లారు.
అతడు చేసిన పనిని తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కుమారుడు విసేరేసిన డాలర్ల తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చాలా వరకు డబ్బులను స్థానికులు తీసుకెళ్లారు. మిగిలినవి గాలికి నాలుగు దిక్కుల ఎగిరిపోయాయి. గడ్డి మధ్యలో చిక్కుకున్న కొన్ని నోట్లు మాత్రమే దొరికాయి. కుమారుడు చేసిన పనికి ఆ తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.