పర్యాటక ప్రాంతాల జాబితాను సిద్ధం చేసుకుంటే కచ్చితంగా వాటర్ ఫాల్స్, సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి. అవే బెస్ట్ చాయిస్ కూడా. పొద్దున ఎటు తిరిగినా, ఏమీ చూసినా.. సాయంత్రం వేళ బీచ్ ఒడ్డున, చల్లని సముద్ర అలలు కాలికి తగులుతుంటే ఆ హాయే వేరు. పిల్లలు, పెద్దలు బీచ్‌లో ఆడేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.
ప్రకృతి ఒడిలో సేద తీరాలని ఎవ్వరికీ ఉండదు. ఆఫీసులకు సెలవులు దొరికి, కాస్తంత తీరిక చేసుకుని.. పర్యాటక ప్రాంతాలకు ట్రిప్‌కు వెళ్లిపోతాం. ముఖ్యంగా సముద్ర తీరాల్లో చిల్ అవ్వాలని అనుకుంటాం. అందుకే పర్యాటక ప్రాంతాల జాబితాను సిద్ధం చేసుకుంటే కచ్చితంగా వాటర్ ఫాల్స్, సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి. అవే బెస్ట్ చాయిస్ కూడా. పొద్దున ఎటు తిరిగినా, ఏమీ చూసినా.. సాయంత్రం వేళ బీచ్ ఒడ్డున, చల్లని సముద్ర అలలు కాలికి తగులుతుంటే ఆ హాయే వేరు. పిల్లలు, పెద్దలు బీచ్‌లో ఆడేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక కుర్రకారు సంగతి చెప్పనక్కర్లేదు. ఏ పార్టీకైనా ఇప్పుడు బీచ్‌నే ప్రిఫర్ చేస్తారు. అయితే పార్టీల పేరుతో బీచ్‌లో వీరు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఇక్కడంటే బీచ్ వద్ద నగ్నంగా స్నానం చేయడం నిషేధం.. కానీ విదేశాల్లో ఏం చేసినా చెల్లుతుంది.
సముద్ర తీరాల్లో నగ్నంగా స్నానం చేయడం, విచ్ఛలవిడి శృంగారం పరిపాటి అయ్యింది. ఇదే ఆ దేశానికి పెద్ద తల నొప్పిగా మారింది. దీంతో ఓ దేశం మేల్కొని.. కొన్ని చర్యలు చేపట్టింది. అదే నెదర్లాండ్. బీచ్‍లో లవర్స్ లేదా జంటలు బహిరంగంగా లైంగిక చర్యల్లో పాల్గొనరాదని, నగ్నంగా సన్ బాత్ చేయకూదడని ఉత్వర్తులు జారీ చేసింది. వీర్ మున్సిపాలిటీ బీచుల్లో లైంగిక కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సముద్ర తీరం వెంబడి లైంగిక కార్యకలాపాలు సాగుతున్నట్లు ప్రభుత్వానికి, వాటర్ బోర్డుకు గురించి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో బహిరంగ లైంగిక చర్యలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పట్టణ మేయర్ ఫ్రెడరిక్ షౌవెనార్ చెప్పారు. దీనిలో భాగంగా బీచ్ లో 8 చోట్ల సందర్శకుల కోసం సమాచార బోర్డులు ఏర్పాటు చేశారు. అవుట్‌డోర్‌లో సెక్స్ అనేది సరైన చర్యకాదని, సన్ బాత్ చేసే వ్యక్తుల వల్ల ఇతరులు ఇబ్బందిగా భావిస్తున్నారని అన్నారు.