మనం నిత్య జీవితంలో చేసే ప్రతిదీ యుద్ధమే. అయితే అందులో కొన్ని యుద్ధాలు ప్రకృతితో చేయాల్సి వస్తుంది. బ్రతకాలంటే పోరాటం చేయాలి. ఇక్కడి ప్రజలు ప్రకృతితో యుద్ధమే చేస్తున్నారు. కానీ, అది వారు చేసిన తప్పుకు పడిన శిక్ష కాదు. ఎవరో చేసిన తప్పునకు వాళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లాలో తెలీక ఏకంగా సముద్రంతోనే సమరానికి సిద్ధమయ్యారు. తమ గ్రామాన్ని కాపాడు కోవడానికి పోరాడుతున్నారు.
ఈ కథ బంగాళఖాతం సమీపంలోని ఓ గ్రామానిది. వాళ్లు దాదాపు 2009 నుంచి సముద్రంతో పోరాడుతున్నారు. పర్యావరణంలోని మార్పుల వలన కడలి వారి ఊరిలోకి వస్తోంది. ఊరు వదలి బయటకి వెళ్లి జీవించే స్థోమత తమకు లేదని అక్కడి స్థానికులు వాపోతున్నారు. సముద్రం నీళ్లు ఊర్లోకి రాకుండా తీరం వెంట ఇసుక సంచులతో గోడలు కడుతున్నారు. ఏవరో చేస్తున్న పర్యావరణ కాలుష్యానికి మేము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదొక్కటే వారి సమస్య కాదు. తాగునీరు కూడా వారిని వేధిస్తున్న మరో సమస్య. అక్డ అంతా ఉప్పు నీరే ఉండటం వల్ల గుక్కెడు మంచినీళ్లు దొరకడం గగనమే. ఇది ఒక్కసారితో పరిష్కారమైయే సమస్య కాదు.
ఈ కారణంగానే 12 ఏళ్ల క్రితమే కొపెన్ హగాన్ పర్యావరణ సదస్సులో తమ కష్టాలను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు ఖాతున్. పర్యావరణ నియంత్రణ కింద అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏడాదికి 10 బిలియన్ డాలర్లు ఇస్తామని 10 ఏళ్ల కిందట హామి ఇచ్చారు. నేటికి ఆ హామీలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. ఇలాంటి హామీలు ఇచ్చే నేతలు తమ క్రెడిబులిటీని కొల్పోతారని అక్కడి వారు అంటున్నారు.గ్లాస్కో వేదికగా జరుగుతున్న పర్యావరణ సదస్సులో తమ సమస్యపై గట్టిగా నిలదీస్తామని అక్కడి స్థానికులు అంటున్నారు. ఈ సారి జరగనున్న పర్యావరణ సదస్సులో ఒత్తిడి ఉంటుందనటంలో ఏటువంటి సందేహం లేదు. కడలితో పాటు సూర్యుడి ప్రతాపానికి తాము అల్లాడిపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రపంచం తమని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ఆ గ్రామం కష్టాలకు కారణం ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.