ఇప్పటివరకు కుల, మత, జాతి, వర్ణ, వర్గ వివక్షలను చూశారు. వాటి వల్ల ఎంత మంది ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు. ఈ తరహా వివక్షను మీరు చూసి ఉండరు. చూడటం కాదు కదా ఊహించి కూడా ఉండరు. రూపం బాలేదని అతడిని వెలి వేశారు. సమాజంలో చోటులేక అడవిలో ఆశ్రయాన్ని పొందాడు. ఓ ఛానల్ చేసిన పోరాట ఫలితంగా తాను సమాజంలో భాగమే అని నమ్మి అతనికి ఆశ్రయాన్ని ఇచ్చారు. ఇప్పుడు అతను అక్కడ ఒక రియల్ హీరో.. ఎంతో మందికి ఇన్‌స్ప్రేషన్ కూడా.
వివరాల్లోకి వెళితే.. ఇది రువాండాకు చెందిన జాంజిమాన్ ఎల్లీ కథ ఇది. ఇతడిని అక్కడ రియల్ లైఫ్ మోగ్లీ అని కూడా పిలుస్తారు. కథలో మోగ్లీ అడవి నుంచి సిటీ కొచ్చాడు.. జాంజిమాన్ మాత్రం సమాజం నుంచి అడవిలోకి వెళ్లాడు. ఈ 22 ఏళ్ల కుర్రాడికి ఒక అరుదైన వ్యాధి ఉంది. దానిని మైక్రోసెఫాలీ అంటారు. అది వచ్చిన వారికి సాధారమ వ్యక్తుల కంటే తల చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. అతని రూపం అసహజంగా ఉందంటూ అందరూ అసహ్యించుకోవడం మొదలు పెట్టారు. అంతేకాదు గ్రామంలో ఉండేందుకు కూడా ఒప్పుకోలేదు. అతను సమాజానికి దూరంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా జాజిమాన్‌కు వినిపించదు, మాట్లాడలేడు. అతని తల్లికి జాజిమాన్ కంటే ముందు ఐదుగురు పిల్లలను కోల్పోయింది. ఒంటరి తల్లి కావడంతో అతని పోషణ కూడా ఎల్లీకి భారంగా మారింది.
ఇదీ చదవండి: ఈ వారం నామినేషన్స్ లో ఉన్న హౌస్ లోని సభ్యులు వీళ్లే..
అయితే అఫ్రిమాక్స్ అనే టీవీ ఛానల్ జాజిమాన్‌కు సాయం చేయాలంటూ ప్రచారం చేసింది. గో ఫండ్ అనే వెబ్‌సైట్ ద్వారా మనమందరం సాయం చేద్దాం అంటూ విస్తృత ప్రచారం సాగించింది. ఆ ఛానల్ కృషి వల్ల జాజిమాన్ ఎల్లీ సాధారణ జీవితం సాగిస్తున్నాడు. రువాండాలోని గిసేనీలోని ఉబుమ్వే కమ్యూనిటీ సెంటర్‌లో స్పెషల్ ఎబిలిటీ పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో చేరాడు.
కస్టమైజ్‌డ్ స్కూల్ యూనిఫాంతో జాజిమాన్ ఎల్లీ ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాజిమాన్ తల్లి ఎంతో భావోద్వేగంగా ‘ఒకప్పుడూ అందరూ నా జాజిమాన్‌ను చూసి ఎగతాళి చేసేవారు. మా జీవితాలు ఇప్పుడు మారిపోయాయి. నా కొడుకు ఆనందంగా పాఠశాలకు వెళ్తున్నాడు. మాకు ఒక ఇల్లు కూడా ఇచ్చారు. నా బాధలను ఒక్క నిమిషంలో తీర్చేశారు’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. జాజిమాన్ ఎదుర్కొన్న సమస్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
The story of Zanziman Ellie Mowgli transformation is inspirational, Everyone this a happy life, We can all work to eliminate stigmatization in our respective societies. pic.twitter.com/bQhwIm02Tf
— Sam Wamalwa🇰🇪 (@samsmoothke) October 28, 2021