అగ్రరాజ్యమైన అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ నగరంలో ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 13 మంది గాయపడినట్లు సమాచారం. న్యూయార్క్ బ్లూక్లిన్ లో ఉన్న సబ్ వేలో మంగళవారం ఉదయం ఓ మాస్క్ ధరించిన వ్యక్తి ఉన్నట్లుండి స్టేషన్ లో విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాగా నిందితుడు నిర్మాణ రంగ కార్మికుడిలా డ్రెస్ చేసుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఘటనా స్థలంలో విపరీతమైన పొగ కమ్ముకోవడంతో ఫైర్ సిబ్బంది, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనా స్థలంలో కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. దీన్ని ఉగ్రదాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Multiple people shot at 36 street station by two people in #sunsetpark. All are currently being transported to the hospital #NewYork #Brooklyn pic.twitter.com/3Va2iXf0JQ
— Derek French Photo (@derekcfrench) April 12, 2022