ఈ మద్య ప్రపంచ దేశాల్లో వరుస భూకంపాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఏ క్షణంలో భూకంపం వస్తుందో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకం ప్రళయం తల్చుకుంటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఈ దారుణ ఘటనలో 50 వేల మంది చనిపోయారు.
ప్రపంచ దేశాలను ఇప్పుడు భూకంపాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, ఇండోనేషియా, జపాన్, నేపాల్, అఫ్ఘనిస్తా లాంటి దేశాల్లో తరచూ భూకంపాలు రావడం చూస్తూనే ఉన్నాం. ఈ మద్యనే పాకిస్థాన్ లో భూకంపం బీభత్సం సృష్టించింది.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5 పాయింట్లుగా నమోదైంది. దీని ప్రభావం ఆఫ్ఘనిస్తాన్, భారత్ లో పలు చోట్ల భూమి కంపించింది. తాజాగా జపాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల తరుచూ జపాన్ లో భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా జపాన్ లోని భారీ భూకంపం హోకైడో ని ఒక్కసారే వణికించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 గా నమోదు అయ్యింది. జపాన్ ఉత్తర ప్రాంతంలో హోకైడో ఉంది. మధ్యాహ్నం 2.48 నిమిషాల సమయంలో నెమురో రీజియలన్ లో భూమి ఒక్కసారే కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. మళ్లీ ఇదే రీజియన్ భూకంపం వణికించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ భూ కంపాల వల్ల పలు చోట్ల భవనాలకు బీటలు వారాయి. ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియరాలేదేని అధికారుల తెలిపారు.
ఈ నెల 24 శుక్రవారం జపాన్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఇజు దీవుల్లో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.6 గా నమోదు అయ్యింది. తరచూ జపాన్ లో భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. జపాన్ లోని ఇజు ద్వీపం అగ్నిపర్వతాలు ఉన్న ప్రదేశం.. ఈ కారణంతోనే అక్కడ తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయని అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో సంభవించిన భూకం ప్రళయంలో 50 మంది చనిపోగా.. కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ సంఘటన తర్వాత భూకంపం అంటే భయంతో వణికిపోతున్నారు.
6.1 magnitude earthquake hits Hokkaido, Japan: National Center for Seismology pic.twitter.com/XvNcq2toyZ
— OTV (@otvnews) March 28, 2023