సోమవారం ఓ స్కూల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీని నుంచి బయట పడేందుకు విద్యార్థులు స్కూల్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మధ్యకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా ఎంతో మంది సజీవ దహనమవుతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో రెండు మూడు చోట్ల అగ్ని ప్రమాదాల ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది అమాయకులు సజీవ దహనమయ్యారు. అయితే ఈ వరుస అగ్ని ప్రమాద ఘటనలు మరువకముందే తాజాగా ఓ స్కూల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పాఠశాలలో మంటలు మంటలు చెలరేగడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయందోళనలకు గురయ్యారు. ఆ సమయంలో వారికి బయటపడే మార్గం లేక స్కూల్ భవనం నుంచి కిందకు దూకారు. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
మధ్య ఆఫ్రికాలోని దేశమైన కాంగాలోని కొల్వేజీ సిటీలోని ఓ స్కూల్ లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం క్లాసులు ప్రారంభం అవ్వగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన విద్యార్థులు అందరూ వెంటనే బయటకు వచ్చారు. అయితే స్కూల్ బిల్డింగ్ పైన ఉన్న క్లాసులో ఉన్న విద్యార్థులు బయపడి కిందకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ, మెట్ల మార్గంలో మంటలు రావడంతో వారికి బయటపడే మార్గం కనిపించలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు స్కూల్ బిల్డింగ్ నుంచి కిందకు దూకారు. ఈ క్రమంలోనే కొంతమందికి కాళ్లు విరిగినట్లు సమాచారం. మొత్తానికి ఈ ప్రమాదం నుంచి విద్యార్థులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అనంతరం ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసినట్లు తెలస్తుంది. అయితే ఈ ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.
— Hardin (@hardintessa143) April 25, 2023