ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం ఓ మనిషి ప్రాణాన్ని మరో మనిషి తీస్తే చట్టం ప్రకారం కోర్టు దోషికి శిక్ష వేస్తుంది. ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ నిందితులపై వారి వారి రాజ్యాంగాల ప్రకారం నేరస్తులకు న్యాయస్థానాలు శిక్షలను అమలు చేస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఓ మనిషి ఓ జంతువులను హింసించినా లేక చంపినా చట్టం ప్రకారం అతనికి శిక్ష పడుతుంది.
అదే జంతువు మనిషి ప్రాణాన్ని తీస్తే కోర్టు శిక్ష వేయడం ఎక్కడా చూశారా? ఇక ఇలాంటి విచిత్రమైన కేసే ఒకటి ఆఫ్రికాలో వెలుగు చూసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ సూడాన్ లో 45 ఏళ్ల అదీయు చాపింగ్ అనే మహిళపై ఓ గొర్రె దాడి చేసింది. ఈ దాడిలో గొర్రె తన కొమ్ములతో పదె పదె మెన్నుముక్కపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ చివరికి మరణించింది.
ఇది కూడా చదవండి: Price: సామ్యానుడి నెత్తిన మరో పిడుగు..పెరగనున్న వాటి ధరలు!
ఇదే విషయంపై మృతురాలు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గొర్రెను అదుపులోకి తీసుకున్నారు. ఇక స్థానిక మీడియా నివేదిక ప్రకారం సూడాన్ లోని లేక్ స్టేల్ లోని అడ్యూల్ కౌంటీ సైనిక శిబిరంలో గొర్రె మూడేళ్లు గడుపుతుందని కోర్టు తెలిపింది. అయితే ఈ దాడిలో గొర్రె యజమాని నిర్దోషి అని దోషిగా మాత్రం గొర్రెనే అంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ఆ దేశ చట్టం ప్రకారం ఒక వ్యక్తని చంపే జంతువు బాధిత కుటుంబానికే చెందుతుంది కోర్టు తెలిపింది. ఇక ఇదే కాకుండా గొర్రె యజమాని బాధిత కుటుంబానికి ఐదు పశువులు పరిహారంగా కింద ఇవ్వాలని దీంతో పాటు గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధించాలని కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇటీవల వెలువరించిన ఈ తీర్పు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గొర్రెకు కోర్టు విధించిన శిక్షపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.