సమాజంలో అందరం అన్నిటికి భయపడుతుంటాము. అయితే కొన్ని కళ్లారా చూసి భయపడితే మరికొన్ని ఊహించుకొని భయపడుతుంటాము. అయితే కొన్నిసార్లు ఆ భయం తాలుక వాస్తవాలను తెలుసుకోడానికి ఆ ప్రాంతానికి ధైర్యం చేసి వెళ్తాం. తీరా అక్కడ చూసినవి కామెడీగా అనిపిస్తాయి. ఇలాంటి వీడియోలు ఎక్కడ ఉన్న సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలా అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ వింత సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
ఓ ఇంటి యాజమాని తన కిచెన్ లో శబ్ధం రావటాన్ని గమనించాడు. భయంతో చాలా సమయం వరకు లోపలకి వెళ్లలేదు. ధైర్యం చేసి ఆ శబ్ధం ఏంటని చూడటానికి వెళ్లిన ఆ ఇంటి యాజమానికి షాకింగ్ దృశ్యం కనిపించింది. అడవుల్లో ఉండాల్సిన ఎలుగుబంటి ఇంట్లో కిచెన్ లో దర్శనమిచ్చింది. ఆకలి మీదున్న ఆ ఎలుగుబంటి డెస్క్ పై కూర్చోని హాయిగా కేఎఫ్ సీ చికెన్ ముక్కలు తింటోంది. ఆబరాగా తింటుడాన్ని ఆ ఇంటి యాజమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. కెఎఫ్ సీ చికెన్ రుచికి ఫిదా అయిన ఆ ఎలుగుబంటి వీడియోని నెటిజన్లు తెగ చూస్తున్నారు. ఆ ఎలుగుబంటి చేసిన రచ్చపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.