45 ఏళ్ల వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న మహిళ.. తన సవతి కొడుకుతో ప్రేమాయణం సాగించింది. ప్రేమాయణం సాగించడమే కాకుండా అతడి కారణంగా గర్భం దాల్చింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే.. ముక్కున వేలేసుకోకుండా ఉండలేం. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటన గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వకుండా ఉండలేరు. 45 ఏళ్ల వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న మహిళ.. తన సవతి కొడుకుతో ప్రేమాయణం సాగించింది. ప్రేమాయణం సాగించడమే కాకుండా అతడి కారణంగా గర్భం దాల్చింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఈ ఆశ్చర్యకరమైన, వినడానికే విడ్డూరంగా ఉన్న ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రష్యాకి చెందిన అలెక్సీ అనే వ్యక్తి మెుదటి భార్య చనిపోయింది. దాంతో అతడు కొన్ని రోజుల తర్వాత మెరీనా బల్మషేవా అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక అతడు రెండో పెళ్లి చేసుకునే నాటికే అతడికి 7 సంవత్సరాల కొడుకు వోవా ఉన్నాడు. వీరి కాపురం సజావుగా సాగుతున్న సమయంలో మెరీనా తన సవతి కొడుకు వోవాకు దగ్గరైంది. అప్పటికే అతడు వయసుకొచ్చాడు. దాంతో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. అదీకాక వోవా తనపై చూపిస్తున్న ప్రేమ మెరీనాకు అర్ధం అయ్యింది. ఇద్దరి బంధం తల్లి కొడుకుల బంధం కాదు అని, అంతకంటే ఎక్కువే అని ఆమె అర్ధం చేసుకుంది.
ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి వోవా వయసు 20 ఏళ్లు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే? తన సవతి కొడుకు వోవాతో మెరీనా గర్భం దాల్చింది. దాంతో భర్తకు విడాకులు ఇచ్చి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరికి ఒక కూతురు పుట్టడంతో వీరి జంట మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుర్లు. అయితే వీరి బంధంపై మెరీనా భర్త అలెక్సీ కోపంతో ఉన్నాడు. తన కొడుకుకు ఏమీ తెలీదని, వాడిని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుందని అలెక్సీ చెప్పుకొచ్చాడు. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా గానీ నేను ఇంత బాధపడే వాడిని కాదు అని కానీ, నా కొడుకును ప్రేమించినందుకు జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వీరిద్దరు చాలా సార్లు నా ముందే చనువుగా ఉండే వారని, ఒకే గదిలో వారిద్దరు గడిపేవారని అలెక్సీ పేర్కొన్నాడు. వారి సంబంధం తెలిసే విడాకులు తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అలెక్స్. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మెరీనాకు సపోర్ట్ చేస్తే.. మరికొందరు అలెక్స్ కు మద్ధతుగా నిలుస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.