‘అమ్మ’ అని పిలిపించుకుంటేనే ఆడ జన్మకు అర్ధం ఉంటుందని పెద్దలు అంటుంటారు. అందుకే ‘అమ్మా’ అని పిలిపించుకునేందుకు ప్రతి స్త్రీ ఎంతో తహతహలాడుతుంది. తాను ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిస్తే.. ఇక ఆమె సంతోషానికి అవధులు ఉండవు. అంతేకాక తాను జన్మనివ్వబోయే బిడ్డ కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. కడుపులోని బిడ్డ కాళ్లతో తన్నుతున్నా.. ఆ నొప్పులను కూడా హాయిగా భరిస్తుంది. అలా ప్రతీ తల్లి.. తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. తాజాగా ఓ తల్లి విషయం గురించి మీకు తెలిస్తే సెల్యూట్ చేయక మానరు. ఎలా మోసావు తల్లి అని అనక మానరు. ఇంతకు ఆ తల్లి పడిన కష్టం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రెజిల్ దేశంలోని అమెజోనాస్ స్టేట్ కు చెందిన క్లీడియాన్ శాంటోస్ అనే మహిళ ఇటీవల 7.3 కిలోల బరువు ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు రెండు అడుగుల పొడవు కూడా ఉంది. సాధారణంగా నవజాత శిశువుల బరువు సగటున మగబిడ్డ అయితే 3.3 కేజీలు, ఆడబిడ్డ అయితే 3.2 కేజీలు ఉంటుంది. అయితే ఈ శిశువు ఏకంగా 7.3 కిలోలు ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. క్లీడియాన్ శాంటోస్ పురిటీ నొప్పులతో స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో వైద్యులు ఆ మహిళకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.
అధిక బరువుతో పుట్టిన ఆ శిశువు, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇక ఆ భారీ బుడతకు యాంగర్ సన్ శాంటోస్ అని నామకరణం చేశారు. నాలుగు కిలోల కంటే ఎక్కువ బరువుతో పుట్టే పిల్లలను గర్భధారణ వయసుతో సంబంధం లేకుండా మాక్రోసోమిక్ బేబిగా పరిగణిస్తారు. మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో వచ్చే అత్యధిక బ్లడ్ షుగర్ వల్ల కడుపులోని శిశువు 15 నుంచి 45 శాతం వరకు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. గతంలో 1955లో ఇటలిలో 10.2 కిలోలలో ఒక బిడ్డ పుట్టింది. ఇప్పటికీ ప్రపంచంలో బరువైన బిడ్డల జనాల్లో అదే రికార్డు.
తాజాగా ఈ బ్రెజిల్ బుడత వరల్డ్ రికార్డ్ కు దగ్గరగా వెళ్లాడు. చూశారా.. సాధారణ బిడ్డను నవమాసాలు మోసేందుకు తల్లులు ఎంతో అల్లాడిపోతుంటారు. అలాంటిది ఏకంగా 7 కిలోలపైను బిడ్డను నవ మాసాలు మోసిన ఆ తల్లిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమ్మ నీకు జోహర్లు అంటూ సెల్యూట్ చేస్తున్నారు. నవమాసాలు అన్నికిలలో బరువును ఎలా మోసావు తల్లి అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.