అతడి వయసు 60 ఏళ్లు. పెళ్లిళ్లు చేసుకోవటం అంటే అతడికి మహా ఇష్టం. ఇప్పటికే పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా 100 పెళ్లిళ్లు తన టార్గెట్ అంటూ బాంబు పేల్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పెళ్లంటే నూరెళ్ల పంట అంటారు పెద్దలు. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన వాళ్లు.. మిగిలిన జీవితం మొత్తం కలిసి జీవించాలన్నది ఆ మాటల ఉద్దేశం. అయితే, కొంతమంది తమ దాంపత్య జీవితాల్లో ఇబ్బందులు, మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని వేరే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఇద్దరు ముగ్గుర్ని పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. భారత్ లాంటి దేశాల్లో బహుభార్యాత్వం నేరం కాబట్టి.. విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలి. కానీ, కొన్ని దేశాల్లో మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. ఈ ఒక్క అవకాశంతో కొంతమంది మగాళ్లు రెచ్చిపోతున్నారు. పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన జీవితకాలంలో 100 పెళ్లిళ్లు చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన 60 ఏళ్ల ఓ వృద్ధుడికి పెళ్లిళ్లు చేసుకోవటం అంటే మహా ఇష్టం. అందుకే తాను చనిపోయేలోగా వంద మందిని పెళ్లి చేసుకోవాలని అతడు డిసైడ్ అయ్యాడు. ఇప్పటి వరకు 26 మందిని పెళ్లి చేసుకున్నాడు. వీరిలో నలుగురు మహిళలకు అతడే విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన 22 మంది భార్యలతోనే నివసిస్తున్నాడు. ఈ 22 మందిలో 19 ఏళ్ల యువతి కూడా ఉండటం గమనార్హం. దీని గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘ నేను ఆ నలుగురికి విడాకులు ఇస్తానని ముందే తెలుసు. అయినా నాతో పెళ్లికి ఒప్పుకున్నారు. నేను విడాకులు తీసుకున్న ఓ మహిళకు నా ద్వారా 22 మంది పిల్లలు పుట్టారు.
నేను విడాకులు తీసుకున్నా నా మాజీ భార్యలకు, నా పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నాను. నేను 100మందిని పెళ్లి చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాను. దేవుడి కృప వల్ల నా కల నెరవేరాలి’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ కాంట్రాక్ట్ మ్యారేజ్‌లకు ఇతడు రారాజు’’.. ‘‘ ఇతడికి 100 పెళ్లిళ్లు కాదు.. వంద చెప్పు దెబ్బలు కావాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pakistan में ये चिचाजान 26 शादियाँ करके 22 लड़कियों को तलाक़ दे चुका है…कह रहा है कि ये मेरा शौंक है…100 शादियाँ करूँगा…सबको तलाक़ दूँगा… pic.twitter.com/YHPk09PXRa
— Jyot Jeet (@activistjyot) February 17, 2023