స్మార్ట్ ఫోన్లకు పెద్ద వాళ్లే కాదూ చిన్న పిల్లలు కూడా బానిసలవుతున్నారు. ఫోన్‌లో వీడియోలు చూడటం, గేమ్‌లు ఆడటం చేస్తూ ఏం చెప్పిందీ వినిపించుకోవడం లేదు. ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. కాసేపు ఫోన్ దూరం చేశామా.. ఇల్లంతా గుల్ల చేసేస్తారూ. వీరితో పోరు పడలేక తల్లిదండ్రులు సైతం ఫోన్లు ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నారు. అలానే ఓ కుమారుడికి ఫోన్ ఇచ్చాడు తండ్రి. అతడి చేసిన చర్యతో తండ్రి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇంతకూ ఆ కుమారుడు ఏం చేశాడో తెలియాలంటే చదివేయండి మరీ..
అమెరికాలోని మెట్రో డెట్రాయిడ్ లోని చెస్టర్ఫీల్డ్ టౌన్ షిప్ ప్రాంతంలో కీత్ స్టోన్ హౌస్ కుటుంబం నివసిస్తుంది. శనివారం రాత్రి ఆ ఇంటి బెల్ మోగింది. ఏంటా అనే చూసేసరికి ఆర్డర్ వచ్చింది. వెంటనే మరో ఆర్డర్ ఇంటికి చేరింది. విరామం లేకుండా కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది. ఫుడ్ ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. రొయ్యల కూర, షవర్మా, ఐస్ క్రీమ్, జంబో రొయ్యలు, సలాడ్, చిల్లీ చీజ్, ద్రాక్ష, బియ్యం వచ్చాయి. ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆర్డర్లు వస్తుండటంతో ఫోన్ తీసుకొని చూడగా.. ఆశ్చర్య పోవడం తండ్రి వంతైంది. తీరా బ్యాంకు ఖాతా చెక్ చేయగా మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ మొత్తం ఆర్డర్లకు వెయ్యి డాలర్లు ( రూ. 82 వేలు) ఖర్చయింది. ఇదంతా ఎవరూ చేశారనుకుంటున్నారు ఓ ఆరేళ్ల పిల్లాడు.
కీన్ స్టోన్ హౌస్ కి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆడుకుంటాడని ఆ చిచ్చర పిడుగుకి ఫోన్ ఇవ్వగా.. అతడు ఓ యాప్ తెరిచి అందులో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అనంతరం అతడిని నిద్ర పుచ్చాడు తండ్రి. డోర్ బెల్ మోగుతుండగా.. ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. తొలుత తన భార్య బేకరీకి సంబంధించినవీ అనుకున్నానని, అయితే తర్వాత తన కొడుకు నిర్వాకమని తెలుసుకున్నానని తండ్రి కీత్ తెలిపారు. యాప్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన ప్రతిసారీ టిప్ గా 25 శాతం కూడా కుమారుడు చెల్లించాట. వరుస ఫుడ్ డెలివరీలతో తన ఖాతాకు చిల్లు పడిందన్నారు. ఈ వార్త వైరల్ కాగా, సదరు యాప్ సంస్థ కీన్ ఇంటికి వచ్చి.. వెయ్యి డాలర్ల కూపన్ ఇవ్వడం కొసమెరుపు. పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి.. మీరు ఎప్పుడైనా ఇలా సరదాగా ఇరుక్కు పోయిన సందర్భాలుంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి.